భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటు తుపాకీ కలకలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటు తుపాకీ కలకలం సృష్టించింది.మద్యం మత్తులో భార్యపై తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు భర్త.

 Gun Firing In Bhadradri Kothagudem District-TeluguStop.com

జూలూరుపాడు మండలం పుల్లూడుతండాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మద్యానికి బానిసైన భర్త శ్యామ తరుచూ భార్య శాంతిపై ఘర్షణకు పాల్పడేవాడు.

ఇదే తరహాలో నిన్న రాత్రి మద్యం సేవించి వచ్చిన శ్యామ గొడవకు దిగాడు.అనంతరం శాంతి కిరాణ దుకాణానికి వెళ్లి వస్తుండగా వెనుక నుంచి కాల్పులు జరిపాడు.

అనంతరం అక్కడి నుంచి పరార్ అయ్యాడు.స్థానికులు బాధితురాలిని వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కాగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తుపాకీ తయారీదారుడిని అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు నిందితుడు శ్యామ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube