చినజీయర్ స్వామి( Chinajiyar Swami ) గురించి మనందరికి తెలిసిందే.తాజాగా ఆయన మేనల్లుడు అయిన విష్ణు స్వామి కు సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చినజీయర్ స్వామి సోదరి కుమారుడైన విష్ణు స్వామి( Lord Vishnu ) ఆశ్రమ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు.ఆశ్రమంలో చినజీయర్ తర్వాత విష్ణు స్వామి మాటే చెల్లుతుంది.
అంత మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు.ఆశ్రమంలో విష్ణు స్వామిని చిన్న స్వామి అని అంటారు.
తెల్ల రంగు ధోవతి, ఉత్తరీయం ధరించి పూజలు చేస్తూ బుద్ధిమంతుడిలా కనిపించే విష్ణు స్వామిలో ఎవరు ఊహించని మరో కోణం కూడా ఉందడోయ్.
ఇదే విషయాన్నీ ఒక మీడియా ఛానల్ వెల్లడించింది.రాత్రైతే జల్సా రాయుడు గెటప్ లోకి మారి జీన్స్ ప్యాంట్, టీషర్ట్ వేసుకుని లగ్జరీ కార్లలో అమ్మాయిలతో కలిసి నైట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారట విష్ణు స్వామి.అంతేకాకుండా కార్లను వేగంగా నడపడం, స్నేహితులతో కలిసి పబ్ లకు వెళ్లడం మద్యం, సిగరెట్ తాగే వారితో కలిసి ఎంజాయ్ చేయడం చెవులు చిల్లుపడేలా మ్యూజిక్ ని ఆస్వాదించడం లాంటివి ఈయన రాత్రి పూట చేసే చర్యలు.
రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటే ఏ వాహనం వివరాలైనా ఆన్ లైన్ లో ఇట్టే తెలుసుకోవచ్చు.వాహన యజమాని పేరు, చిరునామా వంటివి వస్తాయి.కానీ విష్ణు స్వామి తిరిగే కారు వివరాలు మాత్రం కనిపించవు.వాహన యజమాని పేరు స్థానంలో నల్ అని కనిపిస్తుంది.
ఆయన కారు నంబర్ ఏపీ 37 సీయూ 0999 ( AP 37 CU 0999 )అయితే సున్నా తీసేసి కేవలం ఏపీ 37 సీయూ 999గా ఉంచారు.అందుకే తెలంగాణ చలానా వెబ్ సైట్ లో యజమాని పేరు కనిపించదు.విష్ణు కారు బీఎండబ్ల్యూ ఎక్స్ 5.దీని ధర కోటి పైనే ఉంటుందట.కాగా ఇప్పటి వరకు ఈ వాహనం పై మూడు చలానాలు పడ్డాయి.ఇంత వరకూ ఆ చలానా కట్టలేదు మొత్తానికి విష్ణు స్వామి పగలంతా పూజలు, రాత్రైతే రాజభోగాలతో యువరాజులా జీవిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
మరి ఈ విషయంపై చినజీయర్ స్వామి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎంతో బుద్ధిమంతుడుగా కనిపించే విష్ణు స్వామి ఇంక నీచుడా అంటూ విరుచుకుపడుతున్నారు.