రష్యా అధ్యక్షుడు పుతిన్ ( Vladimir Putin )ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీసీ) నుంచి అరెస్ట్ వారెంట్‌ను ఎదుర్కొంటున్న విషయం అందరికీ విదితమే.ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా( South Africa ) కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తన దేశంలో పుతిన్‌ను అరెస్టు చేయకుండా దౌత్యపరమైన రక్షణ ఇచ్చినట్టు తెలుస్తోది.ఈ ఏడాది ఆగస్టులో జరగబోయే బ్రిక్స్ సదస్సుకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ క్రమంలో పుతిన్‌తో పాటు ఆ దేశ ప్రతినిధులకు ఇక్కడ రక్షణ కల్పించింది.
ఉక్రెయిన్ – రష్యా దాడిలో భాగంగా ఉక్రెయిన్( Ukraine )లోని చిన్నారులను రష్యా అపహరించుకు పోయిందన్న ఆరోపణలపై మార్చిలో ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేసింది.దీనిని అప్పట్లోనే రష్యా తోసిపుచ్చింది.కానీ ఐసీసీ సభ్య దేశంగా.
పుతిన్ తమ దేశం వస్తే, దక్షిణాఫ్రికా అరెస్టు చేయాల్సి ఉంటుంది.కానీ దీనికి వ్యతిరేకంగా ఆ దేశం తాజా ప్రకటన విడుదల చేయడం ఇపుడు మిగిలిన దేశాలకు మింగుడు పడడం లేదు.
మరీ ముఖ్యంగా అమెరికాకి.రష్యాని ఏకాకిగా చేయాలన్న అమెరికా ఆలోచన రోజురోజుకీ నీరుగారి పోతోంది.
ఇకపోతే ఈ ఏడాది బ్రిక్స్ సదస్సులకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తోంది.దీనిలో భాగంగా జూన్ 1-2 తేదీల్లో కేప్‌టౌన్‌లో బ్రిక్స్ మంత్రిత్వ స్థాయి సమావేశం భారీ స్థాయిలో జరగనుంది.ఆగస్టు 22-24 జొహాన్నెస్‌బర్గ్‌లో 15వ బ్రిక్స్ సదస్సు ఆల్రెడీ ప్లాన్ లో వుంది.దీనికి పుతిన్ హాజరవుతారనే వార్తలు కూడా ఇక్కడ పెద్ద చర్చకు దారితీయడం కొసమెరుపు.
ఐసీసీ ఒప్పందంపై రష్యా సంతకం చేయలేదు.అయితే ఐసీసీ సభ్య దేశాల్లో పుతిన్ పర్యటించనంతకాలం ఆయన్ను అరెస్టు చేయడం కుదరదని ఇదివరకే పలు నివేదికలు వెల్లడించడం పుతిన్ కి అనుకూలంగా మారింది.