ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.45
సూర్యాస్తమయం: సాయంత్రం 06.40
రాహుకాలం:ఉ.10.30 మ12.00
అమృత ఘడియలు:ఆశ్లేష మంచిది కాదు
దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీకు దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది.వృధా ఖర్చులు చేస్తారు.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.కుటుంబ సభ్యులతో వాదనలు వాదనలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలో పెట్టుబడుల విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాలు అప్రమత్తంగా వివరించాలి.
వృషభం:

ఈరోజు మీరు చేపట్టిన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.ఆర్థిక పరిస్థితి అసజనకంగా ఉంటుంది.దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.సోదరుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది.వృత్తి ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి.
మిథునం:

ఈరోజు భాగస్వామ్య వ్యాపార లాభాలను అందుకుంటారు.కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యులసహాయ సహకారాలు ఉంటాయి.నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం:

ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు జరుగుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
సింహం:

ఈరోజు మీరు చేపట్టిన వ్యవహారాలు ఆటంకులు ఎదురైన ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు.అనుకోకుండా చేసిన ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.క్రమ విక్రమాల్లో నూతన లాభాలు పొందుతారు.కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.ఉద్యోగమున ఒత్తిడి పెరుగుతుంది.
కన్య:

ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది.దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది.బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
వ్యాపార వ్యవహారాలు వేగవంతంగా చేస్తారు.వృత్తి ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
తులా:

ఈరోజు భూ సంబంధిత క్రమవిక్రమాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.దీర్ఘకాలిత వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతారు.వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి.
సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్థిక సహాయం అందుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.
వృశ్చికం:

ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థానాలు ఉంటాయి.వ్యాపార పరంగా ఎదురైన అవరోధాలను అధిగమిస్తారు.సంతాన విద్య విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.దూర ప్రాంతపు మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు.
ధనస్సు:

ఈరోజు మీకు ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి.చాలాకాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు.సంఘంలో గౌరవ మర్యాదలు శత్రువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
మకరం:

ఈరోజు మీరు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడతారు.విందు వినోదాల కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.
వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు.వ్యాపారాల్లో ఊహించని లాభాలు అందుకుంటారు.
కుంభం:

ఈరోజు మీకు వాహన కొనుగోలు ప్రయత్నాలు పలుస్తాయి.వృత్తి ఉద్యోగాల్లో సొంత ఆలోచనలను ఆచరణలో పెడతారు.చేపట్టిన పనులను సకలంలో పూర్తిచేసి ప్రముఖుల నుండి ప్రశంసలు పొందుతారు.కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.
మీనం:

ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి డబ్బులు అందుతాయి.నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.ప్రయాణాలు పరిచయాలు పెరుగుతాయి.
వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
DEVOTIONAL