థియేటర్ లో అందరూ చూస్తుండగా నవదీప్ పరువు తీసేసిన అల్లు అర్జున్..వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్

టాలీవుడ్ ఇండస్ట్రీ లో నేటి తరం హీరోల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.అభిమానులు ఎలా ఉన్నా, హీరోలు మాత్రం అన్నదమ్ములు లాగ కలిసి మెలిసి ఉంటారు.

 Funny Incident Between Allu Arjun And Navadeep During Chandamama Movie Details,-TeluguStop.com

అలా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ( Allu Arjun ) ఇండస్ట్రీ లో పెద్ద గ్యాంగ్ ఉంది.ఆ గ్యాంగ్ లో నవదీప్( Navadeep ) కూడా ఒకడు, కెరీర్ ప్రారంభం నుండే వీళ్ళు మంచి స్నేహితులు.

హైదరాబాద్ లో పార్టీ కల్చర్ ని అందరూ బాగా ఫాలో అవుతూ ఉంటారు, అల్లు అర్జున్ మరియు నవదీప్ కూడా అలంటి వాళ్ళే.ప్రతీ వారం పార్టీలలో కలుస్తూ ఉండే వీళ్ళు అలా స్నేహితులు కూడా అయ్యారు.

వీళ్లిద్దరు కలిసి ఇది వరకు ‘ఆర్య 2 ‘ మరియు ‘అలా వైకుంఠపురం లో’ వంటి సినిమాలలో నటించారు.ఈ రెండు సినిమాలలో ‘ఆర్య 2 ‘ ( Arya 2 ) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గా ఆడగా, ‘అలా వైకుంఠపురం లో’ చిత్రం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.

Telugu Allu Arjun, Alluarjun, Allu Sirish, Chandamama, Navadeep, Icon Allu Arjun

ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ తో తనకి జరిగిన ఒక సంఘటన గురించి నవదీప్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.ఆయన మాట్లాడుతూ ‘చందమామ సినిమా ( Chandamama Movie ) విడుదల రోజు నేను నా గ్యాంగ్ లో ఉన్న 30 మంది స్నేహితులకు ఒక థియేటర్ లో రో మొత్తం టికెట్స్ బుక్ చేసి తీసుకెళ్ళాను.ఆ 30 మంది స్నేహితులలో అల్లు అర్జున్ మరియు శిరీష్ కూడా ఉన్నారు.అయితే ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో నేను కాజల్ తో అలాంటి పనులన్నీ చేసేసిన తర్వాత, ఆమె వెంటనే ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అంటుంది, అప్పుడు నేను పెళ్లి లాంటి ఆలోచనలు లేవు, మళ్ళీ ఇలాంటివి కావాలంటే చెప్పు చేసుకుందాం అంటాను, ఆ సన్నివేశం గుర్తు ఉంది కదా?, థియేటర్ లో ఆ సన్నివేశం వచ్చినప్పుడు అల్లు అర్జున్ పైకి లేచి విజిల్స్ వేసాడు, రేయ్ నీ నిజమైన క్యారక్టర్ ని భలే తీశారు రా అని గట్టిగా అరిచాడు, ఒరేయ్ పరువు తియ్యకు రా బాబు కూర్చో అని చెప్పాను’ అంటూ నవదీప్ ఈ సంఘటనని ఈ సందర్భంగా పంచుకున్నాడు.

Telugu Allu Arjun, Alluarjun, Allu Sirish, Chandamama, Navadeep, Icon Allu Arjun

అలా మా ఇద్దరి మధ్య ఎన్నో ఫన్నీ సంఘటనలు చోటు చేసుకున్నాయని నవదీప్ ఈ సందర్భంగా తెలిపాడు.ఇప్పుడు అల్లు అర్జున్ పెద్ద పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు, అయినప్పటికీ కూడా ఒకప్పుడు నాతో ఎలా ఉండేవాడో, ఇప్పటికీ అలాగే ఉన్నాడు.ఇప్పటికీ మేము వీకెండ్స్ లో సమయం దొరికినప్పుడల్లా కలుస్తుంటాము, బాగా ఎంజాయ్ చేస్తాము అని చెప్పుకొచ్చాడు.ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రం షూటింగ్ లో బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే.

రీసెంట్ గానే ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఒక గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అంతే కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది, ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది లోనే పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube