సనాతన ధర్మం లో ఒక్కొక్క వస్తువుకి ఒక్కో రకమైన ప్రాముఖ్యత ఉంటుంది.మనం ఇంట్లో ఆడపిల్లకు వివాహం చేసి అత్తవారింటికి పంపించేటప్పుడు చీర చరలను పెడుతూ ఉంటాము.
కానీ వాటిలో కొన్ని వస్తువులను మన ఇంటి నుంచి వియ్యంకులు వారింటికి అస్సలు పంపించకూడదు.వాటి వల్ల మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి( Goddess Lakshmi ) వెళ్ళిపోయి ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వేదపండితులు చెబుతున్నారు.
అలాంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఆడపిల్లలు అత్తవారింటికి ఉప్పు( Salt )ను అస్సలు తీసుకురాకూడదు.
సాధారణంగా ఉప్పును లక్ష్మీదేవికి ప్రతి స్వరూపంగా భావిస్తారు.అలాంటి ఉప్పును ఆడపిల్ల అత్తారింటికి తీసుకుని వెళ్లకూడదు.
దీనివల్ల మన ఇంట్లో ఆర్థిక సమస్యలు( Financial problems ) మొదలయ్యే అవకాశం ఉంది.అలాగే ఆడపిల్లకు ఇవ్వకూడని వస్తువులలో చింతపండు కూడా ఉంది.

చింతపండు( Tamarind ) ఆడపిల్లకు ఇవ్వడం వల్ల మనకి వారికి తగాదాలు అవుతాయని పెద్దవారు చెబుతూ ఉంటారు.కాబట్టి వారితో సంబంధాలు మంచిగా ఉండాలి అంటే చింతపండు అసలు పంపించకూడదు.ఇంకా చెప్పాలంటే దూదితో మనము ఒత్తులు చేసుకునే దీపారాధన చేసుకుంటూ ఉంటాము.అది మన ఇంటికి ఎంతో శుభసూచకం.ఇలాంటి వస్తువులను మన ఇంటి ఆడపిల్లకు అస్సలు ఇచ్చి పంపకూడదు.దీనివల్ల మన ఇంటి శుభాలు అన్ని దూరం అయిపోతాయి.
ఇంకా చెప్పాలంటే పాలు, పెరుగు( Milk, curd ) మన ఇంటి నుంచి ఆడపిల్ల తీసుకుని అత్తవారింటికి వెళ్ళకూడదు.ఇలాంటి వస్తువులు తీసుకోకపోతే వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి.
కాబట్టి ఇలాంటి వస్తువులు ఆడపిల్లకు ఇవ్వకపోవడమే మంచిది.ఇంటిని శుభ్రం చేసుకునే చీపుర్లను లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాము.
ఈ చీపుర్లను దాటడం కానీ ఒకరికి ఇవ్వడం కానీ చేయకూడదు.ఇలా చేస్తే మనకు వారికి గొడవలు మొదలవుతాయి.
అంతేకాకుండా లక్ష్మీదేవిగా భావించే చీపురులను ఆడపిల్లలకు ఇచ్చి పంపిస్తే మన ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి.
LATEST NEWS - TELUGU







