ఐపీఎల్ సీజన్లో సగానికి పైగా మ్యాచులు పూర్తయ్యాయి.ప్రస్తుతం జట్ల మధ్య ప్లే ఆఫ్ కోసం పోటాపోటీ సాగుతోంది.
భారీగా 200 లకు పైగా ఉన్న టార్గెట్ ను కూడా సులువుగా ఛేదిస్తున్నారు.తాజాగా శనివారం బెంగుళూరు- ఢిల్లీ( Delhi Capitals ) మధ్య జరిగిన మ్యాచ్లో బెంగుళూరు 181 పరుగులు చేసింది.
ఇక బెంగుళూరు జట్టుదే విజయం అని అందరూ భావించారు.కానీ ఢిల్లీ క్యాపిటల్స్ 20 బంతులు మిగిలి ఉండగానే నిర్దేశించిన లక్ష్యాన్ని కొట్టిపడేసింది.
ఈ మ్యాచ్లో రెండు జట్ల బ్యాటర్లు, బౌలర్ల పై విరుచుకుపడ్డారు.ఈ సీజన్లో బ్యాటర్లు తెగించి ఆడుతూ, ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు.

ప్లే ఆఫ్స్ కు చేరాలంటే కొన్ని జట్లకు తదుపరి అన్ని మ్యాచ్లలో గెలవడం తప్పనిసరి.ఈ క్రమం లో ప్రస్తుతం అన్ని మ్యాచ్లు హోరాహోరీగా జరుగుతున్నాయి.తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ లో ఇదే జరిగింది.

లీగ్ పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ కసితో ప్రత్యర్థి జట్లపై విరుచుకుపడుతోంది.అయినా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశాలు చాలా తక్కువ.ఎందుకంటే ఆడిన పది మ్యాచ్లలో ఢిల్లీ ఆరు మ్యాచ్లలో ఓడి నాలుగు విజయాలతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
ఇంకా ఢిల్లీ నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంది.ఈ నాలుగు మ్యాచ్లలో గెలిచినా కూడా ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశాలు చాలా తక్కువ.

ఢిల్లీ చేతిలో బెంగుళూరు ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు తగ్గాయి.బెంగుళూరు జట్టు తదుపరి మ్యాచ్లలో కచ్చితంగా గెలవాల్సిందే.ప్రస్తుతం ప్లే ఆఫ్స్ కుచేరే జట్ల జాబితాలో గుజరాత్ ( Gujarat Titans )అగ్రస్థానంలో ఉంది.రెండో స్థానంలో చెన్నై ఉంది( Chennai Super Kings ).మూడో స్థానంలో లక్నో జట్టు ఉంది.నాలుగో స్థానంలో రాజస్థాన్, ఐదు స్థానంలో ముంబై, ఆరో స్థానంలో బెంగుళూరు, ఏడో స్థానంలో పంజాబ్, ఎనిమిదో స్థానంలో కోల్ కత్తా, తొమ్మిదో స్థానంలో ఢిల్లీ, పదవ స్థానంలో హైదరాబాద్ జట్లు నిలిచాయి.







