మణిపూర్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను రక్షించాలని టీడీపీ నేత చంద్రబాబు కోరారు.ఈ మేరకు విద్యార్థులను ఏపీకి తరలించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా విద్యార్థుల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.కాగా మణిపూర్ లో నెలకొన్న శాంతి భద్రతల సమస్యతో అక్కడ ఉన్న వందలాది మంది తెలుగు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులను, పౌరులను సురక్షితంగా తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.







