Regina Cassandra : రెజీనా కసాండ్రకు అవకాశాలు ఇవ్వకపోవడానికి కారణం అదేనా.. ఆమె అంతకు తెగిస్తుందా?

కొన్ని కొన్ని సార్లు స్టార్ నటీనటులకు కూడా అవకాశాలు రాని సందర్భాలు ఉంటాయి.ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది కాబట్టి.

 Reason Behind No Movie Offers For Regina Cassandra-TeluguStop.com

ఒక హోదా లో ఉన్నామనుకొని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు.దాంతో దర్శక నిర్మాతలు వాళ్లకు అవకాశాలు లేకుండా చేస్తూ ఉంటారు.

ఇప్పటికి చాలామంది నటీనటులు తమ అతి వల్ల ఇండస్ట్రీకి దూరమైన సందర్భాలు ఉన్నాయి.అయితే రెజీనా కూడా అలా ప్రవర్తించడం వల్ల అవకాశాలు తగ్గాయని తెలుస్తుంది.

ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

Telugu Farzi, Shivamanasulo, Tollywood, Web-Movie

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రెజీనా కసాండ్రా( Regina Cassandra ) తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనా ఎన్నో సినిమాలలో నటించింది.తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక తన గ్లామర్ విషయంలో కూడా బాగా మెప్పించింది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోలతో బాగా సందడి చేస్తుంది రెజీనా.

Telugu Farzi, Shivamanasulo, Tollywood, Web-Movie

శివ మనసులో శృతి( Shiva Manasulo Shruthi ) అనే తెలుగు సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజీనా ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన పిల్ల నువ్వు లేని జీవితం సినిమాలో తన పాత్రకు మంచి గుర్తింపు రాగా ఈ సినిమా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించగా అంతగా మెప్పించలేకపోయింది రెజీనా.

ఇక ప్రస్తుతం అవకాశాలు కూడా అంతగా అందుకోకపోగా వెబ్ సిరీస్ లపై మాత్రం బాగా ఆసక్తి చూపిస్తుంది.

నిజానికి సినిమాలలో కంటే వెబ్ సిరీస్( Web Series ) లలో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది రెజీనా.తన కాస్ట్యూమ్ విషయాలలో మంచి ట్రెండ్ ఫాలో అవుతుంది.

అంతేకాకుండా ఎక్కువ స్వదేశీ వస్త్రాలను బాగా ఇష్టపడుతుంది.తనకు ఏదైనా డ్రెస్ నచ్చితే తక్కువ ధరలో ఉన్న కూడా కొన్ని వేసుకుంటాను అని గతంలో చాలా సార్లు తెలిపింది.

Telugu Farzi, Shivamanasulo, Tollywood, Web-Movie

ఇక సోషల్ మీడియా( Social media )లో యాక్టివ్ గా ఉండటంతో నిత్యం ఫోటోలను షేర్ చేస్తూ బాగా రచ్చ చేస్తుంది.సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది ఈ బ్యూటీ.అయితే ఇదంతా పక్కనే పెడితే ఈమెకు టాలీవుడ్ లో అంతగా అవకాశాలు లేకుండా పోయాయి.ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఎదిగిన ఈమెకు అవకాశాలు రాకపోవడానికి కారణం ఒకటుందని తెలుస్తుంది.

అదేంటంటే ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయంలో, కథ విషయంలో చాలా బోల్డ్ గా ఉంటుందట.అంతేకాకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ.హీరోలను డామినేట్ చేయటానికి చూస్తుందట.దీంతో ఆమెకు దర్శకులు కానీ, స్టార్స్ కానీ అవకాశాలు ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదని తెలిసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube