తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవం తీసుకురావడమే ధ్యేయంగా .నాలుగు వేల కిలోమీటర్ల పాదయత్రే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మరియు పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) కుమారుడు అయిన నారా లోకేష్( Nara Lokesh ) మొదలుపెట్టిన భారీ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది .
కుప్పంలో మొదటి అడుగు పడిన ఈ పాదయాత్ర కర్నూలు జిల్లా ఆదోనికి చేరుకునేసరికి వేయి కిలోమీటర్లు పూర్తిచేసుకుంది … అసలు ఏ లక్ష్యంతో అయితే పాదయాత్ర మొదలైందో ఇప్పుడు పాదయాత్ర ఆ లక్ష్యం దిశగానే కదులుతుందా? లోకేష్ ఆశించిన ప్రయోజనం కలుగుతుందా ? అని చూస్తే ఆసక్తికర జవాబులు వస్తున్నాయి.
పాదయాత్ర మొదలుపెట్టకు ముందు , మొదలు పెట్టిన తర్వాత 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ప్రస్తుత తరుణంలోనూ తెలుగుదేశం పార్టీ ప్రాబల్యాన్ని పరికించి చూస్తే ఆ పార్టీకి చాలా ప్రయోజనం కలిగిందని తెలుస్తుంది.నియోజకవర్గం లో నాయకులతో లోకేష్ సమన్వయం చేసుకుంటున్న తీరు వారి ఆవేదనను అర్థం చేసుకుంటూ భవిష్యత్తుపై వారిలో భరోసా నింపుతున్న విధానం వారు పార్టీ మారకుండా, పక్కచూపులు చూడకుండా చేయగలిగిందని దీనిని లోకేష్ విజయం గానే చూడాలని వార్తలు వస్తున్నాయి.నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభావం చూపగల కొంతమంది కీలక నేతలు పార్టీ మారడం ఖాయమని వార్తలు వచ్చినప్పటికీ లోకేష్ ని కలిసిన తర్వాత ఆయనతో చర్చించిన తర్వాత తాము పార్టీ మారడం లేదని బహిరంగంగా ప్రకటించి లోకేష్ పాదయాత్ర( Lokesh Padayatra )లో కలిసి నడిచిన సంఘటనలు కనిపించాయి.
తాను జూనియర్ అయినప్పటికీ సీనియర్లను సమాధానపరిచే స్థాయికి లోకేష్ పరిణితి చెందాడని పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను కార్యకర్తల ఆలోచన సరళిని అర్థం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపే విధానం పట్ల ఆయనకు అవగాహన పెంచుకుంటున్నాడాని తెలుగుదేశం శ్రేణులు చెప్పుకొస్తున్నాయి.ఏది ఏమైనా నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం లోకేష్ వల్ల కాదని ప్రతిపక్షాలు ఎద్దేవా చేసినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా మలమలమాడే ఎండలో పట్టుదలనే ఆయుదo గా చేసుకుని తిరుగుతున్న లోకేష్ ఖచ్చితంగా తను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడని తెలుగుదేశం శ్రేణులు గట్టిగా నమ్ముతున్నాయి.