నోటి పూత( mouth ulcers ).దీనిని మౌత్ అల్సర్( Mouth ulcer ) అని అంటారు.
పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో నోటి పూత ఒకటి.అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చేత నోటి పూతకు గురవుతుంటారు ఏదేమైనా నోటి పూత వల్ల తీవ్రమైన నొప్పిని, బాధను అనుభవిస్తుంటారు.
నోటి పూత కారణంగా ఏం తినాలన్నా, తాగాలన్నా తెగ ఇబ్బంది పడుతుంటారు.మాట్లాడటానికి కూడా చాలా అసౌకర్యంగా ఉంటుంది.
అయితే నోటి పూతను వేగంగా మరియు సులభంగా నివారించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.ఈ చిట్కాలు పాటిస్తే రెండు రోజుల్లో నోటి పూత నుంచి రిలీఫ్ పొందుతారు.
తులసి ఆకులు నోటి పూతను నివారించడానికి గ్రేట్ గా సహాయపడతాయి అందుకోసం నాలుగు లేదా ఐదు తులసి ఆకులు ( Basil leaves )తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి.ఆపై గ్లాస్ గోరు వెచ్చని నీటిని సేవించాలి.
రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే నోటి పూత చాలా త్వరగా తగ్గుతుంది.
అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్,( Muleti powder ) వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ) వేసుకుని బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని నోటి పూత పై అప్లై చేయాలి.రోజుకు రెండు సార్లు కనుక ఇలా చేస్తే నోటిపూత నుంచి వేగంగా విముక్తి పొందుతారు.
కొబ్బరి నూనె ( coconut oil )నోటి పూత నివారించడానికి అద్భుతంగా సహాయపడుతుంది.అందుకోసం నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను నోట్లో వేసుకొని కనీసం ఐదు నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మేయాలి.ఉదయం సాయంత్రం ఇలా చేస్తే నోటి పూత నుంచి రిలీఫ్ పొందుతారు.నోటిపూతకు గురైనప్పుడు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఆరెంజ్ జ్యూస్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.మసాలా ఐటమ్స్ ను కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి.ద్వారా నోటి పూత నుంచి వేగంగా బయటపడతారు.