టీఎస్పీఎస్పీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఈ వ్యవహారంలో లౌకిక్, సుస్మితలను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
మూడు రోజుల కస్టడీలో భాగంగా ఇద్దరిని విచారించిన పోలీసులు ఇవాళ రెండో రోజు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.ఉదయం 8 గంటలకు ఇద్దరిని ఖమ్మం తీసుకెళ్లారు సిట్ అధికారులు.
ఈ క్రమంలోనే లౌకిక్ దంపతుల ఇంట్లో సోదాలు నిర్వహించనున్నారు.అయితే లౌకిక్ తన భార్య కోసం ప్రవీణ్ నుంచి డీఏఓ పేపర్ ను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు.