తెలుగు ప్రేక్షకులకు మెగా కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) సతీమణి అయిన ఉపాసన ( upasana )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఉపాసన ఒకవైపు మెగా కోడలిగా బాధ్యతలను చేపడుతూనే మరొకవైపు అపోలో హాస్పిటల్స్ కి మేనేజర్ గా కూడా బాధ్యతలను నిర్వహిస్తోంది.
అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు ఇస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది.
ఇక సమయం దొరికినప్పుడల్లా తన భర్త అయిన రామ్ చరణ్ తో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఉపాసన.ఇకపోతే ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ ( Upasana pregnant )అన్న విషయం మనందరికీ తెలిసిందే.దీంతో ఆ విలువైన సమయాన్ని భర్తతో గడుపుతూ సమయాన్ని ఎంచక్కా ఆస్వాదిస్తుంది.ఇది ఇలా ఉంటే ఉపాసన ఇప్పటికే ఎంతోమందికి సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్న విషయం తెలిసిందే.
సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మనసులలో మంచి గుర్తింపును ఏర్పరచుకుంది.తాజాగా కూడా ఉపాసన మరోసారి తన గొప్ప మనసును చాటుకుంది.
తాజాగా ఉపాసన గురువారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో హౌజ్ ఆఫ్ టాటా నుంచి జోయా కొత్త స్టోర్‌ను ప్రారంభించింది.ఈ స్టోర్ ప్రారంభంచినందుకు గాను యాజమాన్యం ఇచ్చిన రెమ్యునరేషన్‌ను విరాళంగా అందించింది.ఆమెకు వచ్చిన మొత్తాన్ని దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్( Domakonda Fort and Village Development Trust ), దాని కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలని ఉపాసన నిర్ణయించుకున్నారు.అణగారిన వర్గాలకు చెందిన మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ట్రస్ట్ కట్టుబడి ఉంటుందని ఉపాసన తెలిపారు.</br
ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.హౌస్ ఆఫ్ టాటా నుంచి జోయా స్టోర్‌ను జూబ్లీహిల్స్‌లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.జోయాలో లభించే ఆభరణాలు విలాసవంతమైన జ్యువలరీ కి కేరాఫ్ అడ్రస్.ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి అతిథిగా ఆహ్వానించిన జోయాకు ప్రత్యేక ధన్యవాదాలు.మహిళా సాధికారతను అందించే లక్ష్యంతో దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్‌మెంట్ ట్రస్ చేపడుతున్న కార్యక్రమాలు మద్దతునిస్తున్నాయి అని తెలిపింది ఉపాసన.