సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన ఎన్నో ఫన్నీ వీడియోలు మనకు కనిపిస్తుంటాయి.అలాంటివి చూడగానే మనకు ఫక్కున నవ్వు వస్తుంది.
ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మన మూడ్‌ను అలాంటి ఫన్నీ వీడియోలు మార్చేస్తాయి.అయితే కొన్ని సందర్భాల్లో జంతువులు ఏకంగా మనుషులపై దాడి చేస్తుంటాయి.
ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఎలుగుబంట్లకు( bears ) మనం కంటపడితే వెంటపడి తరుముతాయి.చివరికి మనం ఎక్కడ దాక్కున్నా దాడి చేస్తాయి.
కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు ఎదురవుతాయి.ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ అటవీ ప్రాంతంలో ఉన్న వ్యక్తికి ఎలుగు బంటి కనిపిస్తుంది.దీంతో అతడు వెంటనే పరుగులు పెడతాడు.ఆ ఎలుగు బంటి కూడా అతడి వెంటపడి తరుముతుంది.ప్రాణ భయంతో దాని నుంచి తప్పించుకునేందుకు ఆ వ్యక్తి ప్రయత్నిస్తాడు.చివరికి చాలా వేగంగా వెళ్లి చెట్టు ఎక్కుతాడు.అయినప్పటికీ ఆ ఎలుగు బంటి అతడిని వదల్లేదు.
చెట్టెక్కుతుండగా అతడి కాలు పట్టుకుని లాగుతుంది.
అతడు మరింత పైకి ఎక్కాడు.ఆ ఎలుగు బంటి కూడా అతడి వెంటే చెట్టు ఎక్కి దాడి చేసింది.ఈ వీడియోను ఆడ్లీ టెర్రిఫైయింగ్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది.
ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.అటవీ ప్రాంతాల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.