చూస్తుండగానే ఆవిరైపోయిన ఆస్తులు.. ప్రపంచ కుబేరుడు సర్‌ రిచర్డ్‌కి మిగిలిందిదే!

కాలిఫోర్నియాకు చెందిన వర్జిన్ ఆర్బిట్ అనే రాకెట్ తయారీ సంస్థ కొన్ని వారాల క్రితం కార్యకలాపాలను నిలిపివేపింది.తర్వాత దాని యజమాని దివాలా కోర్టులో రక్షణ కోసం చాప్టర్ 11 బ్యాంక్‌రప్టసీ దాఖలు చేశారు.

 Evaporated Assets What Is Left Of The Worlds Tycoon Richard Branson , Sir Richar-TeluguStop.com

బ్రిటీష్ బిలియనీర్ సర్ రిచర్డ్ బ్రాన్సన్( Richard Branson ) యాజమాన్యంలోని స్పేస్ టూరిజం కంపెనీ వర్జిన్ గెలాక్టిక్‌ నుంచి సెపరేట్‌గా వర్జిన్ ఆర్బిట్ కంపెనీ 2017లో ప్రారంభమైంది.వర్జిన్ ఆర్బిట్ లాంచర్‌వన్ రాకెట్‌( Virgin Orbit )ను అభివృద్ధి చేయడానికి, మార్కెటింగ్ చేయడానికి బాధ్యత వహిస్తుంది.

ఇది ఇప్పటివరకు ఆరు మిషన్‌లను ప్రదర్శించింది.వాటిలో నాలుగు సక్సెస్ అవుతే, రెండు ఫెయిల్ అయ్యాయి.

కొత్త పెట్టుబడిని పొందలేకపోవడం వల్ల కంపెనీ 2023, ఏప్రిల్ 4న ఆపరేషన్స్‌ ఆగిపోయాయి.

దివాలా కోసం దాఖలు చేసినప్పటికీ కొనుగోలుదారుని కనుగొనాలని వర్జిన్ ఆర్బిట్ భావిస్తోంది.

ఇక లాంచర్‌వన్ లేటెస్ట్ మిషన్ 2023, జనవరిలో యూకేలోని కార్న్‌వాల్ నుంచి తొమ్మిది ఉపగ్రహాలతో నింగిలోకి ఎగిరింది.అయితే, రాకెట్ రెండవ దశలో ఇంజన్‌లో మంట రాజుకుంది.

దీని వల్ల రాకెట్, అది మోసుకెళ్తున్న ఉపగ్రహాలను కంపెనీ కోల్పోయింది.ఇది యూకే నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహ మిషన్, కానీ అది విఫలమైంది.

దాంతో సర్‌ రిచర్డ్‌ బ్రాన్సన్ కంపెనీలో పెట్టిన ఆస్తులన్నీ కరిగిపోయాయి.

Telugu Bankruptcy, Rocket Launch, Latest, Necker Island, Rocketlaunch, Virginorb

వ్యాపారవేత్తగా దాదాపు 60 సంవత్సరాల తర్వాత బ్రాన్సన్‌కి ఇది మరో ఫెయిల్యూర్ వెంచర్ అయింది.అయితే అంతిమంగా 72 ఏళ్ల ఈ వ్యాపారవేత్త ఓడిపోలేదు.2023 ప్రారంభం నాటికి, బ్రాన్సన్ నికర ఆస్తుల విలువ 3.6 బిలియన్ డాలర్లు ఉన్నాయి.ఆ సమయానికి అతను ప్రపంచంలోని 798వ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు.

Telugu Bankruptcy, Rocket Launch, Latest, Necker Island, Rocketlaunch, Virginorb

బ్రాన్సన్‌కి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో అనేక ఇళ్లు ఉన్నాయి.కానీ అతను నెకర్ ద్వీపం( Necker Island )లో నివసిస్తున్నాడు.అతను ఈ ద్వీపాన్ని 1.80 లక్షల డాలర్లకు కొనుగోలు చేశాడు.దానిని ఒక విలాసవంతమైన రిసార్ట్‌గా మార్చడానికి 10 మిలియన్ డాలర్లు వెచ్చించాడు.ఇక్కడ బస చేసేందుకు ప్రతి రాత్రికి 40,000 డాలర్లు చెల్లించాలి.ఇకపోతే నివేదిక ప్రకారం, వర్జిన్ ఆర్బిట్ కొత్త కొనుగోలుదారుని కనుగొనడంలో సహాయపడటానికి రాకెట్ సంస్థకి సిస్టర్ కంపెనీ అయిన ‘వర్జిన్ ఇన్వెస్ట్‌మెంట్స్’ $31.6 మిలియన్ల కొత్త నిధులను అందించడానికి సిద్ధమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube