నెక్స్ట్ జనరేషన్ ఎన్టీఆర్ అంటూ విశ్వక్ పై కామెంట్స్.. ఆయన రియాక్షన్ ఏంటంటే?

ఈతరం నటులలో ఒకరైన విశ్వక్ సేన్( Vishwak sen ) మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులను సైతం మెప్పించి ఆకట్టుకున్నారు.విశ్వక్ సేన్ కెరీర్ లో సక్సెస్ రేట్ ఎక్కువనే సంగతి తెలిసిందే.

 Vishwak Sen Shocking Comments About Ntr Details, Vishwak Sen, Junior Ntr, Das Ka-TeluguStop.com

విభిన్నమైన కథలతో విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకు వస్తుండగా ఎన్టీఆర్ కు( NTR ) విశ్వక్ సేన్ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే.కొంతమంది విశ్వక్ సేన్ నెక్స్ట్ జనరేషన్ ఎన్టీఆర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ కామెంట్ల గురించి విశ్వక్ సేన్ స్పందిస్తూ నేను నేనే ఎన్టీఆర్ అన్న ఎన్టీఆరే అని ఆయనతో తనను పోల్చవద్దని కామెంట్లు చేశారు.విశ్వక్ సేన్ తన ప్రతి సినిమాలో ఎన్టీఆర్ రెఫరెన్స్ ఉండేలా చూసుకుంటారనే సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ కు సైతం ఫ్యాన్ బాయ్ అయిన విశ్వక్ సేన్ అంటే ఎంతో అభిమానం కనబరుస్తున్నారు.భవిష్యత్తులో వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్స్ హవా అయితే నడుస్తోంది.విశ్వక్ సేన్ ఎన్టీఆర్ తో కలిసి మల్టీస్టారర్ చేయడానికి నో చెప్పే అవకాశం ఉండదు.ధమ్కీ సినిమాకు( Dhamki ) ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగింది.ఈ సినిమా ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి.దాస్ కా ధమ్కీ రేంజ్ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

విశ్వక్ సేన్ టాలెంటెడ్ హీరో కాగా ఈ హీరోకు ప్రముఖ నిర్మాతల సపోర్ట్ కూడా ఉందని తెలుస్తోంది.విశ్వక్ సేన్ కు సరైన సక్సెస్ దక్కితే ఊహించని రేంజ్ కు విశ్వక్ ఎదుగుతాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.విశ్వక్ సేన్ ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.సినిమా సినిమాకు విశ్వక్ సేన్ రేంజ్ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube