స్టార్ హీరోలను విశ్వక్ సేన్ మెప్పించడానికి కారణం అదేనా?

టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్( Vishwak Sen ) ఒకరు.ఈయన అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించి తన నటనతో యాటిట్యూడ్ తో ఆకట్టు కున్నాడు.

 Star Heros Fans Of Vishwak Sen, Vishwak Sen, Venkatesh, Ntr, Ram Charan, Allu Ar-TeluguStop.com

అయితే ఈయన విషయంలో చాలా మందికి ఒక సందేహం వస్తుంది.యంగ్ హీరోని స్టార్ హీరో ప్రమోట్ చేయాలంటే అది సాధారణ విషయం కాదు అనే చెప్పాలి.

కానీ విశ్వక్ సేన్ విషయంలో మాత్రం అలాంటివి ఏం లేకుండానే స్టార్ హీరోలంతా ఇతడిని ప్రమోట్ చేస్తున్నారు.ప్రెజెంట్ విశ్వక్ సేన్ హీరోగా నటించి తెరకెక్కించిన ధమ్కీ ( Dhamki ) సినిమా మార్చి 22న రిలీజ్ కాబోతుంది.

ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్( NTR ) విచ్చేయడమే కాకుండా విశ్వక్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.ఆయన మాటల్లో మరోసారి విశ్వక్ సేన్ కసి, పట్టుదల అందరికి తెలిసింది.

ఒక పాన్ ఇండియా స్టార్ హీరో అలా మాట్లాడడంతో విశ్వక్ సేన్ ఒక్కసారిగా హైలెట్ అయ్యాడు.అంతకు ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా విశ్వక్ సేన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు.అలాగే వెంకటేష్ కూడా అతడి యాటిట్యూడ్ కు పడిపోయాడు.ఇంకా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Icon star Allu Arjun ) కూడా విశ్వక్ సేన్ పై ఎంతో అభిమానం చూపించాడు.

మరి ఇప్పుడు అందరికి ఇదే అనుమానం.చిన్న హీరోగా ఉన్న ఈ హీరోను స్టార్ హీరోలు సైతం ఎలా పొగుడు తున్నారు? అని.కానీ అందరి మాటల్లో కనిపించింది ఏంటి అంటే.సినిమాపై అతనికి ఉన్న ఫ్యాషన్, కసి, పట్టుదల అనేది నిజం.

వ్యక్తిగతంగా కూడా విశ్వక్ సేన్ ను ఆ స్టార్ హీరోలంతా ఎంతో అభిమానిస్తున్నారు.ఈయన ఎనర్జీ కూడా విశ్వక్ సేన్ కు ప్లస్ అయ్యింది.

నటుడిగా.దర్శకుడిగా.

నిర్మాతగా తనకంటూ స్పెషల్ గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు.మరి స్టార్ హీరోగా మారుతాడా లేదా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube