కృష్ణ యజుర్వేద తైత్తిరీయ(Krishna Yajurveda Taittiriya) సంహిత చతుర్ధకాండంలోని పంచమ, సప్తమా ప్రపాఠకాలను నమకం, చమకం అని పిలుస్తూ ఉంటారు.రెండు కలిపితే రుద్రం.
నమక చమకలు సర్వబద్ధంగా చదువుతూ అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు.నమ్మకంలో విశ్వంలోని ప్రతి అణువు రుద్రుడే అని భావన చేస్తూ ఆయా రూపాల్లో వ్యక్తం అయ్యే రుద్రుడికి నమస్కారం చేయడం ప్రధాన అంశంగా ఉంటుంది.
ముఖ్యంగా చెప్పాలంటే చమకంలో ఇందుకు భిన్నంగా భక్తుడు తన కోరికల చిట్టాను భగవంతుడి ముందు సమర్పిస్తూ ఉంటాడు.శివా వీటన్నిటిని నాకు అనుగ్రహించవలసింది అని ప్రార్థిస్తాడు.
సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోరా, ఈశాన పేర్లతో పంచముఖాలతో నాలుగు దిక్కులను చూస్తూ జగత్తును రక్షిస్తున్నాడు.అయితే రుద్రుడికి పరమాత్మకు ఆత్మార్పణం చేస్తున్నానన్న భావనతో రుద్రాధ్యాయాన్ని పరాయణం చేస్తూ ఉండాలి.
శివారాధనలో ప్రముఖమైన రుద్రాభిషేకాన్ని వివిధ రకాలుగా ఆచరిస్తారు.
ఏకాదశ రుద్రాభిషేకం, లఘురుద్రం, శతరుద్రీయం(Satarudriyam) ఇలా శక్తి సామర్థ్యాలను బట్టి భక్తులు దీనిని నిర్వహిస్తూ ఉంటారు.నమక చమకాల సంఖ్య ఆధారంగా వీటిని వివిధ రకాల రుద్రాభిషేకాలుగా పిలుస్తూ ఉంటారు.శ్రీకృష్ణుడు(Lord Krishna) ఒక సంవత్సరం పాటు పాశుపత దీక్ష చేసి విభూదిని వంటి నిండా అలుముకొని రుద్రాధ్యాయాన్ని పారాయణా చేశాడని కుర్మా పారాయణం చెబుతుంది.
జాబాల ఉపనిషత్తులో బ్రహ్మచార్యులు కిం జప్యేన అమృతత్వమ శ్నుతే? అని ప్రశ్నిస్తారు.అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి ‘శత రుద్రీయం చేయడంతో అమృతత్వం సిద్ధిస్తుందని సమాధానం చెబుతాడు.
ప్రతి రోజు రుద్రాధ్యాయాన్ని జపించే వాళ్లు ముక్తిని పొందుతారని స్మృతులు చెబుతున్నాయి.భోగము, మోక్షము, పాప ప్రాయశ్చిత్తం కోరుకునే వారికి రుద్రుడి ఆరాధనకు మించిన మార్గం లేదని వేద పండితులు చెబుతున్నారు.