తెలుగు సినిమాల్లోని కాని, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోని గాని… బాగా ఈమధ్య కాలంలో వినబడుతున్న వాక్యం ఏదన్నా వుంది అంటే… అది ‘సింహం సింగిల్‌గా వస్తుంది‘ అనే స్టేట్మెంట్.అయితే ఈ మాట నిజంగా వాస్తవమేనా? అని ఎపుడైనా ఆలోచించారా? నిజంగానే సింహం(Lion) ఎక్కడికైనా సింగిల్ గానే వెళుతుందా? ఒకసారి పరిశీలిద్దాము.బేసిగ్గా సింహాన్ని అడవికి రారాజు అని పిలుస్తూ వుంటారు.ఒక పరిశోధన ప్రకారం, సింహాలు తమ శరీర బరువులో 4 నుంచి 6% వరకు సమతూగే ఆహారం మాత్రమే తీసుకుంటాయి.
అయితే కొన్నిసార్లు అవి తమ బరువుకు మించి ఆహారం తినడానికి ఇష్టపడతాయి.
భారతదేశంలోని జూ పార్కులలోని జంతువులపై జరిపిన పరిశోధన ప్రకారం ఒక సింహం లేదా పులి(Tiger) ఒక రోజులో 10 నుండి 14 కిలోల మాంసాన్ని తింటుందని తేలింది.సింహం తాను సులభంగా వేటాడగలిగే జంతువును మాత్రమే తింటుంది.సింహం వేటాడే జంతువులలో గేదె, జిరాఫీ, జీబ్రా, వైల్డ్‌బీస్ట్(wildebeest) మనకు ఎక్కువగా కనిపిస్తాయి.
అయితే ఇలా వేటాడడానికి వెళ్ళేటప్పుడు చాలాసార్లు గుంపులుగానే వెళ్తుతుందని ఓ సర్వే తెలిపింది.కింది విషయాలు చదివితే మీకు ఓ స్పష్టమైన అవగాహన వస్తుంది.
సింహం మాంసాహార జంతువైనప్పటికీ, అది ఎక్కువగా గడ్డి భూముల్లోనే నివసిస్తుంది.సింహాలు మాంసం తిన్న తర్వాత చాలాసేపు అలా నిద్రపోతాయి.సాధారణంగా సింహాలు ఎల్లప్పుడూ గుంపులుగా వేటాటడం మనకు కనిపిస్తుంది.సింహాలు భారతదేశంలో అధికంగా కనిపిస్తాయి.ఇక సింహం గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు.సింహం అప్పుడే చంపిన జంతువునుండి మాత్రమే మాంసాన్ని తింటుంది.
ఆల్రెడీ చనిపోయినటువంటి మృతకళేబరాన్ని ముట్టనే ముట్టదట! కాబట్టి ఈ విషయాలు తెలుసుకున్నాక మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి.