Hyper Adi Priya Vadlamani: హైపర్ ఆది తిక్క కుదిర్చిన హీరోయిన్.. అవమానంతో స్టేజ్ దిగి వెళ్లిపోయిన ఆది?

తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హైపర్ ఆది స్కిట్ లో పంచులు ఏ రేంజ్ లో ఉంటాయో మనందరికీ తెలిసిందే.

 Hyper Aadi Gets Insulted In Show Video Goes Viral Details, Hyper Aadi, Jabardast-TeluguStop.com

ఏ షోకి వెళ్లిన అక్కడ ప్రతి ఒకరిపై వరుసగా పంచులు వేస్తూ నాన్ స్టాప్ పంచులతో కడుపుబ్బనవిస్తూ ఉంటాడు.షోలో జడ్జిని మొదలుకొని యాంకర్ వరకు ప్రతి ఒక్కరిపై వరుసగా పంచులు వేస్తూ ఉంటాడు.

అయితే మొదట్లో హైపర్ ఆది స్కిట్లలో బాగానే ఉండగా ఈ మధ్యకాలంలో హైపర్ ఆది డబుల్ మీనింగ్ డైలాగులతో పాటు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాడు.ఎక్కువగా డబుల్ మినింగ్ డైలాగులు ఉండడంతో పాటు అవుతలి వ్యక్తిని కించపరిచే విధంగా డైలాగులు వేస్తున్నాడు.

ఇక హైపర్ ఆదికి షోలో కొత్త అమ్మాయిలు కనిపిస్తే చాలు వారికి ప్రపోజ్ చేయడం వారి చుట్టూ తిరుగుతూ డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం చేస్తూ ఉంటాడు.ఇది ఇలా ఉంటే తాజాగా కూడా హైపర్ ఆది ఇదేవిధంగా చేయడంతో ఆదితిక్క కుదిర్చింది ఒక హీరోయిన్.

అసలేం జరిగిందంటే.శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ వారం సిటీ అమ్మాయిలు వర్సెస్ విలేజ్ అమ్మాయిలు అనే కాన్సెప్ట్ తీసుకున్నారు.ఈవారం ప్రసారం అయ్యే ఎపిసోడ్లో ఎక్కువగా అమ్మాయిలే కనిపించారు.

ఎప్పటిలాగే హైపర్ ఆది అమ్మాయిలను చూడగానే వారిపై వరుసగా పంచులు వేయడం మొదలుపెట్టాడు.

ముఖచిత్రం సినిమా రిలీజ్ అవుతుండగా ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి హాజరయ్యారు.హీరోయిన్ ప్రియా వడ్లమాని డైరెక్టర్ సందీప్ రాజుతో కలసి షోలో పాల్గొంది.అప్పుడు ప్రియా కనిపించగానే హైపర్ ఆది ప్రపోజ్ చేసే ప్రయత్నం చేయడంతో వెంటనే హైపర్ ఆది ఇంటెన్షన్ కనిపెట్టిన ప్రియా ఆదిని అన్నయ్య అని పిలవడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా పగలబడినవ్వారు.

అప్పుడు హైపర్ ఆది అవమానంగా ఫీల్ అయ్యి స్టేజ్ దిగి వెళ్లిపోయాడు.అప్పుడు స్టేజ్ దగ్గర పై పడుకొని అన్నయ్య అంటే దీని మీద పడుకుంటాను అని అంటూ ఉండగా ఇంతలో పొట్టి నరేష్ అక్కడికి వచ్చి పోనీ బండి పోనీ అని అంటాడు.అప్పుడే ప్రియా అన్నయ్య నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నయ్య అని అనడంతో, అన్నయ్య అంటుంది ఉండలేను అంటుంది ఎవర్రా ఇది అని అనడంతో అక్కడున్న వారందరూ నవ్వుతూ ఉంటారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube