ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో మెసేజ్‌లు డిలీట్ అయితే చింతించకండి.. ఇలా చూడండి..

ప్రస్తుత రోజుల్లో దాదాపు ప్రతి స్మార్ట్‌ఫోన్ యూజర్ వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు.వాట్సాప్‌లో, యూజర్ల కోసం చాలా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

 Don't Worry If Messages Are Deleted On Instagram, Whatsapp See This ,instagram,-TeluguStop.com

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను యూజర్లకు వాట్సాప్ అప్ డేట్ ఇస్తోంది.అయితే కొన్ని సందర్భాల్లో వాట్సాప్‌కు వచ్చిన ఏదైనా మెసేజ్ డిలీట్ అయితే దాని గురించ చాలా మంది ఆందోళన చెందుతుంటారు.

అసలు ఆ మెసేజ్ ఏంటో తెలియక తికమకపడుతుంటారు.అయితే ఇలా డిలీట్ చేసిన మెసేజ్‌ను చూసేందుకు అవకాశం ఉంది.

దీని గురించి తెలుసుకుందాం.

వాట్సాప్‌కు కొందరు మెసేజ్‌లు పంపించి వెంటనే డిలీట్ చేస్తుంటారు.మనకు నోటిఫికేషన్ వస్తుంది.తీరా వాట్సాప్ ఓపెన్ చేసే సమయానికే అవతలి వ్యక్తులు వాటిని డిలీట్ చేస్తుంటారు.

కానీ డిలీట్ అయిన మెసేజ్‌లను స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ఫీచర్ సహాయంతో కూడా చూడవచ్చు.ఈ ఫీచర్ మీ ఫోన్‌లోనే ఉంటుంది.దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్‌లు నోటిఫికేషన్ హిస్టరీ ఫీచర్ ఉంటుంది.దీంతో మీ ఫోన్‌లో వచ్చే అన్ని నోటిఫికేషన్‌లు రికార్డ్ చేయబడతాయి.తద్వారా నోటిఫికేషన్‌లను తర్వాత మీ ఖాళీ సమయంలో చూడొచ్చు.

వాట్సాప్‌లో తొలగించిన మెసేజ్‌ను చూడటానికి, మొదట మీరు మీ ఫోన్ యొక్క నోటిఫికేషన్ హిస్టరీ ఆప్షన్‌ను ఆన్ చేయాలి.దీని కోసం, మీరు ఫోన్ సెట్టింగ్‌ను తెరిచి, నోటిఫికేషన్‌లు & స్టేటస్ బార్ ఆప్షన్‌ను నొక్కండి.దీని తరువాత మీరు మరిన్ని సెట్టింగుల ఆప్షన్‌ను ఓపెన్ చేయాలి.

నోటిఫికేషన్ హిస్టరీ కోసం ఇక్కడ నొక్కి, దాన్ని ఆన్ చేయండి.ఇప్పుడు మీ ఫోన్‌లో ఏ నోటిఫికేషన్‌లు వస్తాయి.

అది నోటిఫికేషన్ హిస్టరీలో సేవ్ అవుతుంది.ఏదైనా మెసేజ్ డిలీట్ అయినా దీనిలో మనం చూడొచ్చు.

అయితే ఇది 24 గంటలలోపు ఉన్నవి మాత్రమే మనం చూడగలం.మిగిలినవి ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube