దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో వివిధ రాష్ట్రాలకు చెందిన చాలా మంది కీలక నాయకుల పేర్లు వెలుగులోకి వచ్చాయి.ముఖ్యంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వంటి వారి పేర్లు తెరపైకి రావడం సంచలనం సృష్టించింది.
ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా వినిపించింది.ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడి ) అధికారులు విచారణ జరుపుతున్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ ప్రమేయం ఉన్నట్లుగా గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, తాజాగా మాగుంట రాఘవ ను ఈడి అధికారులు అరెస్ట్ చేశారు .ఆయన బాలాజీ గ్రూప్ యజమానిగా ఉన్నారు.ఈడి దాఖలు చేసిన చార్జిషీట్ లోనూ రాఘవ పేరు ఉంది.అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో తన కుమారుడి ప్రమేయం లేదని ఇప్పటికే మాగుంట శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు.
అయితే ఈ వ్యవహారంలో సిబిఐ కూడా దర్యాప్తు చేస్తుండడంతో, వరుసగా ఈ కేసులో అరెస్టు లు జరుగుతున్నాయి .దీనిలో భాగంగానే మాగుంట రాఘవ ను అరెస్ట్ చేశారు .రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న మాగుంట రాఘవ ఇప్పుడు ఈ లిక్కర్ స్కాం వ్యవహారంలో అరెస్ట్ కావడం రాజకీయంగాను సంచలనం కలిగిస్తోంది.సౌత్ గ్రూప్ నుంచి విజయ్ నాయక్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు అందించారనే అభియోగాల్లో భాగంగా రాఘవ విచారణను ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే సౌత్ గ్రూప్ నుంచి నలుగురిని అరెస్టు చేశారు.రెండు రోజులు గా రాఘవ ను అధికారులు విచారణ చేస్తున్నారు.
రాఘవ విచారణకు సరిగా సహకరించడం లేదని ఈడి అధికారులు అభియోగాలు నమోదు చేసి అరెస్ట్ చేశారు.ఇదిలా ఉంటే ఈ వ్యవహారం పై శ్రీనివాసులు రెడ్డి స్పందించారు.ఢిల్లీలో 32 జోన్లలో మద్యం టెండర్లు నిర్వహిస్తే రెండు జోన్లు మాత్రమే మాగుంట కుటుంబానికి చెందిన ఆగ్రో ఫార్మ్ సంస్థకు దక్కాయని, కానీ ఆ సంస్థలో తాను, తన కుమారుడు డైరెక్టర్లు కాదని ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు.తమపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, తామ కుటుంబం లిక్కర్ వ్యాపారం లో 70 సంవత్సరాల నుంచి ఉందని , కానీ ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో తాము లేమని చెబుతున్నారు.