అగ్రరాజ్యం అమెరికాను డ్రాగన్ కంట్రీ చైనాకు చెందిన ఓ బైలూన్ వణికిస్తుంది.మెంటానాలోని అణు క్షిపణి కేంద్రంపై స్పై బెలూన్ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.
చైనా స్పై బెలూన్ మూడు బస్సులంత పెద్దగా ఉంది.కాగా అమెరికా సైనిక రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయోగించారని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దీనిపై స్పందించిన చైనా నిఘా బెలూన్ కాదంటోంది.వాతావరణ పరిశోధనల కోసమేనని చైనా అధికారులు చెబుతున్నారు.
గాలులతో దిశ మారి అమెరికా వైపు వెళ్లిందని తెలిపారు.మరోవైపు లాటిన్ అమెరికాలో కూడా స్పై బెలూన్ కనిపించింది.
ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారని సమాచారం.