ప్రదోష వ్రతం దాదాపు మనదేశంలో ఉన్న చాలామంది ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనది.ఎవరైతే ప్రదోష వ్రతాన్ని హృదయపూర్వకంగా ఆచరిస్తారో అలాంటి వారి కోరికలన్నీ శివుడు తీరుస్తాడని గట్టిగా నమ్ముతారు.దుఃఖాలను, పాపాలను కూడా ఈ వ్రతం దూరం చేస్తుందని కూడా నమ్ముతారు.2023వ సంవత్సరం మొదటి ప్రదోష వ్రతం జనవరి 4న పౌరుషమాసం శుక్లపక్షంలోని త్రయోదశి తిధిగా జరుపుకుంటారు.
ఈ సంవత్సరం మొదటి ప్రదోష వ్రతం అంటే 2023 పౌష మాసంలో త్రయోదశి రోజున జరుపుకునే అవకాశం ఉంది.ఇది జనవరి 3:01 నిమిషానికి మొదలై జనవరి 4 రాత్రి 11:50 నిమిషములకు ముగిసే అవకాశం ఉంది.ప్రదోష పూజా వ్రతం ఆధారంగా జనవరి 4 2023 వ తేదీన బుధ ప్రదోష వ్రతన్ని ప్రజలు ఆచరిస్తారు.వ్రతానికి పూజ ముహూర్తం సాయంత్రం ఐదు గంటల 37 నిమిషముల నుంచి ఎనిమిది గంటల 21 నిమిషంలో వరకు ఉంటుంది.ఈ రోజున అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:13 నిమిషముల నుంచి 12.05 నిమిషముల వరకు ఉంటుంది.దీనితోపాటు సర్వార్థ సిద్ది యోగం రోజంతా ఉండే అవకాశం ఉంది.
రవి యుగం సాయంత్రం 6 గంటల 47 నిమిషముల నుంచి తర్వాతి రోజు జనవరి 5 ఉదయం 7:13 నిమిషముల నుంచి మొదలవుతుంది.ప్రదోష వ్రతం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలి.ఆ తర్వాత అక్షర, గంగాజల్ మొదలైన వాటితో శివుడిని పూజించాలి.
ఈ రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయానికి ముందు మళ్ళీ స్నానం చేసి తెల్ల బట్టలు ధరించాలి.ఆ తర్వాత పవిత్రమైన నీటితో పాటు గంగాజలంతో పూజా స్థలాన్ని శుద్ధి చేసుకోవాలి.
ఇలా ఆవు పేడను తీసుకుని దానీ సహాయంతో మండపాన్ని సిద్ధం చేసుకోవాలి.ఐదు రకాల రంగులు సాయంతో మండపం లో రంగొలిని తయారు చేసుకోవాలి.
ఆ తరువాత శివుని ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని జపించి నీటి శివునికి నీటిని సమర్పించాలి.
బుధ ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎలాంటి రోగాలైన దూరం చేసుకోవచ్చు.
ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల దోషాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది.అంతేకాకుండా ప్రదోష వ్రతం సంతానం కలవడానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
ఆర్థిక సమస్యలను కూడా దూరం చేస్తుంది.
DEVOTIONAL