1.జగన్ కడప జిల్లా పర్యటన
ఏపీ సీఎం జగన్ ఈనెల 23 నుంచి 25 వరకు కడప జిల్లాలో పర్యటించమన్నారు.
2.టాబ్ ల పేరుతో భారీ స్కామ్ : టిడిపి
ట్యాబ్ ల పేరుతో రాష్ట్రంలో భారీగా కుంభ కోణం జరిగిందని టిడిపి సీనియర్ నేత పట్టాభి విమర్శలు చేశారు.
3.చదువుతోనే తలరాత మారుతుంది : జగన్
చదువుతోనే విద్యార్థుల తలరాత మారుతుందని ఏపీ సీఎం జగన్ ఆకాంక్షించారు.
4.బై జ్యూస్ ను కాపాడేందుకే ట్యాబ్ ల కాంట్రాక్ట్
ఏపీలో విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ అని వైసిపి గొప్పగా చెప్పుకుంటుందని, బై జ్యూస్ ను కాపాడేందుకు ట్యాబ్ ల కాంట్రాక్టు ఇచ్చారని సిపిఐ నేతలు విమర్శలు చేశారు.
5.గవర్నర్ ను కలిసిన టిడిపి నేతల బృందం
రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ తో టిడిపి నేతల బృందం ఈరోజు భేటీ అయింది.మాచర్ల ఘటనకు సంబంధించి వైసీపీ పై ఫిర్యాదు చేసింది.
6.జలీల్ ఖాన్ కామెంట్స్
వైసిపి పాలనలో మైనార్టీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని టిడిపి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విమర్శలు చేశారు.
7.వివేక హత్య కేసు పై డిఎల్ కామెంట్స్
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు జనవరి 3న ఊహించిన మలుపు తిరుగుతుందని మాజీ మంత్రి టిడిపి నేత డీ ఎల్ రవీంద్ర రెడ్డి అన్నారు.
8.క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక రైళ్లు
క్రిస్మస్ సందర్భంగా తాంబరం – తిరువల్వేలి , చెన్నై ఎగ్మూర్ , తాంబరం – నాగర్ కోయిల్ , ఎర్నాకులం – డా.ఎంజీఆర్ సెంట్రల్ – ఎర్నాకులం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
9.కవిత పై బిజెపి తెలంగాణ ఇంఛార్జి కామెంట్స్
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై బిజెపి తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ కామెంట్ చేశారు.ఢిల్లీ లిక్కర్ స్కాం లో చార్జిషీట్ లో కవిత పేరు 48 సార్లు ఈడి ఎందుకు ప్రస్తావించిందని, అసలు ఆమె ఎందుకు అన్ని ఫోన్లు మార్చారో ప్రజలకు చెప్పాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.
10.అయ్యప్ప దీక్ష విరమించిన పైలెట్ రోహిత్ రెడ్డి
టిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అయ్యప్ప దీక్ష విరమించారు.శబరిమలకు వెళ్ళకుండానే ఎమ్మెల్యే దీక్ష విరమణ చేశారు.ఈడి విచారణకు హాజరు కావల్సి ఉన్నందున దీక్ష విరమించినట్లు సమాచారం.
11.కవితకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేశారు.నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ అంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.
12.జగన్ కు విషెస్ చెప్పిన చంద్రబాబు , పవన్ కళ్యాణ్
ఏపీ సీఎం జగన్ నేడు పుట్టినరోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
13.బాధ్యతలు స్వీకరించిన రవీందర్ సింగ్
తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా రవీందర్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు.
14.దావోస్ పర్యటనకు కేటీఆర్
తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వచ్చే నెల 16న స్విట్జర్లాండ్ లోని దావోస్ కు వెళ్ళనున్నారు అక్కడ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్ పాల్గొననున్నారు.
15.టీటీడీ ఈవో కుమారుడు మృతి
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (28) గుండెపోటు తో కన్ను మూశారు.
16.తిరుమల సమాచారం
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.భక్తుల రద్దీ దృష్ట్యా వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేకంగా టికెట్లు తీసుకు వచ్చింది. 17.విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ నేటి నుంచి ఏపీలోని ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ చేపట్టారు.
18.క్రిస్మస్ విందు
హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలో నేడు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
19 కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ
నేడు ఆదిలాబాద్, కొమురం భీమ్ జిల్లాలో కేసీఆర్ కిట్ల పంపిణీ ని ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, బాల్కా సుమన్ చేపట్టారు.
20.నేడు ఖమ్మం లో టీడీపీ బహిరంగ సభ
నేడు ఖమ్మం జిల్లాలో తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ను ఏర్పాటు చేశారు.
.