పవన్ కళ్యాణ్ వారాహి వాహనం పై వైసిపి చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చిన నాదెండ్ల మనోహర్ ఐటీ విభాగం ప్రతినిధులతో జనసేన పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం ప్రభుత్వ కార్యాయాలకు పార్టీ రంగులు వేసి హైకోర్టుతో మొట్టికాయలు తిన్న వారు కూడా జనసేన పార్టీ వారాహి వాహనం రంగు గురించి మాట్లాడటం,నిబంధనల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది.వారాహి వాహనం నిబంధనలకు అనుగుణంగా సిద్ధం అవుతోంది.
నిబంధనలు పరిశీలించకుండా రవాణా శాఖ వారు అనుమతి ఎలా ఇస్తారు? ఏ మాత్రం ఆలోచన లేకుండా విమర్శలు చేయడం వైసీపీ నాయకుల బుద్ధిరాహిత్యాన్ని, మూర్ఖత్వాన్ని తెలుపుతోంది.ప్రభుత్వ కార్యాలయాలకు ఇష్టానుసారం పార్టీ రంగులు వేసుకునే వారికి నిబంధనలు ఏం తెలుస్తాయి.
జనసేన పార్టీ ఎల్లప్పుడు నిబంధనల ప్రకారం మాత్రమే నడుచుకుంటుంది.పవన్ కళ్యాణ్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజాహితంగా, చట్టానికి లోబడి ఉంటుంది.
వైసీపీ నాయకులకు వ్యక్తిగత విమర్శలు చేయటం అలవాటుగా మారిపోయింది.వాళ్లకు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి చెప్పు చూపిస్తే భయపడ్డారు.అది నిజాయతీకి ఉన్న దమ్ము.పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటన రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది.
రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ కాస్త వైస్సార్సీపీ ఆర్టీసీగా మారిపోయింది.పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ బస్సులు వాడుకోవడం సిగ్గుచేటు.
నిబంధనలు పట్టించుకోని వారు.మాకు నిబంధనలు గురించి చెప్పే అర్హత ఉందా వైసిపి నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రకటన ఇప్పిస్తున్నారు
.