కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర లో భాగంగా గత కొన్ని రోజుల నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారు.ఈ యాత్రకు జనం నుంచి మంచి స్పందన వచ్చింది.
ఈ యాత్ర లో బాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మహబూబ్ నగర్ మండల పరిధిలో ఉన్న గిరిజనులతో కలిసి డ్యాన్ చేశారు.ఆయన తో పాటు సంపత్ కుమార్ కూడా ఉన్నారు.
వారితో మాస్ స్టెప్పులు వేసిన ఆ వీడియోను తన ట్వీట్ ద్వారా షేర్ చేశారు.భద్రాచలం నుంచి వచ్చిన గిరిజనులతో రాహుల్ గాంధీ సంప్రదాయ నృత్యం సంతోషంగా, ఉల్లాసంగా చేశారు.
రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ఉదయం 6 గంటలకు మహబూబ్ నగర్ మండల పరిధిలోని ధర్మాపూర్‌లో ఉన్న జయప్రకాశ్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి మొదలైంది.ఈ జొడో యాత్ర లో మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ సభ్యుడు జైరాం రమేష్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క, మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సీతక్క, సంపత్‌కుమార్ వీరందరూ పాల్గొని ఉస్తాహంగా ముందుకు సాగారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ అందరి తో కలిసి డ్యాన్సులు చేయడం తో గిరిజనులంతా ఎంతో సంతోష పడిపోయారు.ఉత్సాహంగా స్టెప్పులు వేశారు.పాదయాత్ర దారిపోడవునా రాహుల్ గాంధీ పలువురితో కలిసి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.చిన్నారులను భుజాలపై ఎత్తుకొని నడిచారు.చేనేత కార్మికులు వారి సమస్యలను రాహుల్ గాంధీ వివరించారు.కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని తొలగించి, పన్ను మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గిరిజనులతో చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.