నాకంత టైం లేదు... లవ్ లైఫ్ గురించి రష్మిక షాకింగ్ కామెంట్స్?

సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని నేషనల్ క్రష్ గా ఎంతోమందికి అభిమాన నటిగా మారిపోయారు నటి రష్మిక.భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ ఒక వైపు సినిమాలలో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు రహస్యంగా తను ఒక స్టార్ హీరోతో రిలేషన్ లో ఉందంటూ పెద్ద ఎత్తున తన లవ్ లైఫ్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

 I Dont Have Enough Time Rashmikas Shocking Comments About Love Life Rashmika's ,-TeluguStop.com

ఈ వార్తలపై ఇప్పటికే తాను ఎన్నోసార్లు స్పందించి ఈ వార్తలను ఖండిస్తున్నప్పటికీ ఈమె గురించి ఇలాంటి వార్తలు తరచూ వినబడుతూనే ఉంటాయి.

ఈ క్రమంలోనే మరోసారి రష్మిక తన లవ్ లైఫ్ గురించి స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రష్మిక తన కెరియర్ గురించి ఎన్నో విషయాలను తెలియచేశారు.ప్రస్తుతం తను వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నానని ఈ బెజీ షెడ్యూల్లో తన కుటుంబం స్నేహితులతో కూడా సరైన సమయం కేటాయించలేకపోతున్నానని తెలియజేశారు.

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రిలేషన్ షిప్ గురించి కూడా ఈమె స్పందించారు.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ .మనం ఇష్టపడ్డ వారికి కావాల్సినంత టైం ఇవ్వాల్సి ఉంటుంది ఆ బంధం నిలబెట్టుకోవాలంటే ఎంతో ఓర్పు, సహనం, సమయం ఉండాలి.ప్రస్తుతం తనకు అంత టైం లేదని చెబుతూనే తాను ఎవరితోనూ రిలేషన్ లో లేనని ప్రస్తుతం తన సినిమా పనులతో తాను ఎంతో బిజీగా ఉన్నానని ఈ సందర్భంగా తన రిలేషన్ గురించి వచ్చే వార్తలను ఈమె మరొకసారి ఖండించారు.

ఏది ఏమైనా రష్మిక తన లవ్ లైఫ్ గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube