జిల్లాలో శాంతిభద్రతలు ఎంత ముఖ్యమో నేరాలు జరగకుండా చూడటం కూడా అంతే ముఖ్యం : పోలీస్ కమిషనర్ విష్ణు యస్

జిల్లాలో శాంతిభద్రతలు ఎంత ముఖ్యమో నేరాలు జరగకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు.

 Khammam Police Commissioner Vishnu S Warrier Meeting,khammam Police Commissioner-TeluguStop.com

ఈరోజు DPRC భవనంలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ .నేరం జరిగిన తర్వాత స్పందించే కంటే ముందస్తు నేర నివారణ చర్యలు ఉత్తమమైనదని ఆ దిశగా దృష్టి సారించాలని ఆదేశించారు.గత రెండు నెలలుగా వివిధ బందోబస్తు విధులలో బిజీగా భాధ్యతలు నిర్వహించిన పోలీసులు ఇకపై ప్రతిరోజు నగరంలోని రద్దీ ప్రాంతాలలో విజబుల్ పోలీసింగ్ తో పాటు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, అసాంఘిక కార్యకలాపాలపై, నేరస్తుల కదలికపై నిఘా ఉండాలన్నారు.జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని,జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం వాటిల్లకుండా అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా అక్రమ రవాణా నిరోధించే ఉద్దేశంతో ప్రతి చోట వారానికి ఒకసారి కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.

పాత నేరగాళ్లపై నిఘా ఉంచాలని, క్రిమినల్ గ్యాంగ్ కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

అదేవిధంగా బైక్‌ ర్యాష్ డ్రైవింగ్, సౌండ్ పొల్యూషన్, ఈవ్ టిజింగ్, అర్ధరాత్రి రోడ్లపై పుట్టిన రోజు వేడుకలు చేస్తూ… అసాంఘీక కార్యకాలపాలపై ప్రత్యేక దృష్టి సారించి చెక్ పెట్టాలని సూచించారు.

మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ పరికరంతో రద్దీ ప్రాంతాలు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో అనుమానిత వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ ను చెక్ చేయాలని అన్నారు.

నగర శివారు ప్రాంతాలలో ఎక్కువ దృష్టి సారించాలని,ప్రజలు అప్రమత్తత, వ్యక్తిగత జాగ్రత్తలతో పాటు నిరంతరం పోలీస్ ముమ్మర గస్తీ ద్వారా నేరాలను కట్టడి చేయాలని ఆదేశించారు.

ఖమ్మం డివిజన్ లో సెక్టార్ వారిగా భాధ్యతలు అప్పగించిన నూతన ఏస్సైలు ఏలాంటి సంఘటనలు జరగకుండా క్షేత్రస్ధాయిలో దృష్టి పెట్టాలని సూచించారు.

సమావేశంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ శభరిష్, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ ,అడిషనల్ డీసీపీ (AR) కుమారస్వామి,ఏసీపీలు అంజనేయులు, రామోజీ రమేష్ , వేంకటేశ్, రవి, రమేష్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube