నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి ముప్పు పొంచి ఉంది.గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రిజర్వాయర్ కు వదర నీరు వచ్చి చేరుతోంది.
దీంతో అధికారులు ఆరు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.డ్యాం నీటి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా.ప్రస్తుతం 71.29 టీఎంసీలుగా కొనసాగుతుంది.ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 44,493 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 60,453 క్యూసెక్కులుగా ఉంది.
అయితే, సోమశిల జలాశయానికి రూ.99.11 కోట్లతో చేపట్టిన మరమ్మత్తు పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పది శాతం కూడా జలాశయం పనులు పూర్తి కాలేదు.ఈ క్రమంలో వరద ఉధృతి పెరుగుతోంది.వరద ప్రవాహం ఇలానే కొనసాగితే డ్యాం రీటైనింగ్ వాల్స్ కి తీవ్ర ప్రమాదం పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు.దీంతో పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.