జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలని దాదాపు అందరు అమ్మాయిలు కోరుకుంటారు.కానీ, పోషకాల కొరత, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, టెన్షన్స్, ధూమపానం, మద్యపానం, రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను వాడటం వంటి కారణాల వల్ల వివిధ రకాల జుట్టు సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
హెయిర్ గ్రోత్ కూడా ఆగిపోతుంటుంది.దాంతో ఏం చేయాలో తెలియక జుట్టుపై చేయాల్సిన ప్రయోగాలన్నీ చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ సూపర్ రెమెడీస్‌ను ట్రై చేస్తే ముప్పై రోజుల్లోనే మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగడం ప్రారంభమవుతుంది. మరి ఇంతకీ ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు భృంగరాజ్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్, నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెర జెల్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు చుక్కలు విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ కొబ్బరి నూనెను పోయాలి.ఆయిల్ హీట్ అవ్వగానే అందులో మూడు టేబుల్ స్పూన్ల భృంగరాజ్ పౌడర్ వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఇలా మరిగించిన ఆయిల్‌ను కంప్లీట్‌గా కూల్ అయ్యాక.
పల్చటి వస్త్రం సాయంతో స్రైన్ చేసుకోవాలి.పైన చెప్పుకున్న హెయిర్ ప్యాక్ వేసుకుని తలస్నానం చేసిన అనంతరం.
ఆ ఆయిల్‌ను అప్లై చేసుకోవాలి.ఈ రెండు సింపుల్ రెమెడీస్‌ను వారంలో ఒక్కసారి పాటిస్తే మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగడాన్ని మీరే గమనిస్తారు.