శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.చెన్నే కొత్తపల్లి మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్, వైసీపీ నేత ఎం.
రాజారెడ్డి మరికొందరితో కలిసి టీడీపీలోకి చేరేందుకు మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి బయలు దేరారు.ఈ క్రమంలో వీరి వాహనాలు కుంటిమద్ది చెరువు కట్ట మీదకు వెళ్లగానే కొందరు వైసీపీ నేతలు వాహనాలకు అడ్డు నిలిచారు.
అనంతరం అక్కడకు అనుచరులతో కలిసి వచ్చిన ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్ రెడ్డి వీరంగం సృష్టించారు.అసభ్య పదజాలంతో దూషిస్తూ.భౌతిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు, దాడి ఘటనను పరిటాల సునీత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ లు ఖండించారు.
రాజశేఖర్ రెడ్డి దౌర్జన్యాలు రోజురోజుకీ పెరిగి పోతున్నాయని పరిటాల సునీత ఆరోపించారు.ఇటువంటి ఘటనలను ఇకపై సహించేది లేదని తేల్చి చెప్పారు.