ప్రతి జిల్లా హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలి రాష్ట్రంలో 7.7శాతానికి పెరిగిన పచ్చదనం మొక్కల సంరక్షణకు ఉపాథి హామీ కింద పటిష్టమైన చర్యలు ఆగస్టు 21న హరిత హారం నిర్వహణ, హరిత హారం లక్ష్యాల సాధన పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిరాష్ట్ర వ్యాప్తంగా 21 ఆగస్టు, 2022న పెద్ద ఎత్తున హరిత హారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు.స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా హరితహారం కార్యక్రమ నిర్వహణపై, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతకుమారి తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్ లతో మంత్రి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా 21 ఆగస్టు, 2022న నిర్వహించే ప్రత్యేక సమావేశాలను పెద్ద ఎత్తున వివాహాలు ఉన్న నేపథ్యంలో ఇటీవల క్యాబినెట్ రద్దు చేసిందని, ఆగస్టు 21, 2022 న రాష్ట్ర వ్యాప్తంగా హరిత హారం కార్యక్రమం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.8వ విడత హరితహారం కార్యక్రమం కింద జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.జిల్లాలో మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత కల్పించాలని , ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
తెలంగాణ కు హరితహారం కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 240 కోట్లకు పైగా మొక్కలు నాటామని మంత్రి అన్నారు.గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయడం, ప్రజల భాగస్వామ్యం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం శాతం 7.7కు పెరిగిందని మంత్రి పేర్కొన్నారు.
21 ఆగస్టు, 2022న ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు లో మొక్కలు నాటాలని, అవసరమైన మేర మొక్కలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని, గ్రామ పంచాయతీ లో నాటిన మొక్కల సంరక్షణ కోసం ఉపాధి హామీ పథకం కింద పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 19.84 కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఇప్పటి వరకు మూడంతుల పనులు పూర్తి చేసామని అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతకుమారి తెలిపారు.ఆగస్టు 21న జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.
పి గౌతమ్ మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో 8వ విడత హరితహారం కార్యక్రమం కింద 50 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా ఇప్పటివరకు 42 లక్షల మొక్కలు నాటామని తెలిపారు.ఆగస్టు 21న జిల్లా వ్యాప్తంగా మిగులు మొక్కల లక్ష్యాన్ని నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చర్యలు తీసుకుంటామని అన్నారు.ఆగస్టు 20 లోగా గుంతలు తీయడం, మొక్కల్ని సరఫరా, సంబంధిత మెటీరియల్ అంతా సిద్ధం చేస్తామన్నారు.21న ఉదయం 6.00 గంటలకు మొక్కలు నాటడం ప్రారంభిస్తామన్నారు.కొత్త గ్రామ పంచాయతీల్లో ట్యాగింగ్ సమస్యలు ఉన్నట్లు, చర్యలకై కోరారు.
ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ చేసి, హరితహారం కార్యక్రమం విజయవంతం చేస్తామన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మొగిలి స్నేహాలత, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, డీఆర్డీవో విద్యాచందన, జెడ్పి సిఇఓ అప్పారావు, డిపివో హరిప్రసాద్, ఎఫ్డివోలు ప్రకాశ్ రావు, సతీష్ తదితరులు పాల్గొ