1.వాషింగ్టన్ డీసీ లో ఘనంగా భారత స్వాతంత్ర వేడుకలు
భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా వాషింగ్టన్ డీసీ లో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. 2.బ్రిటన్ వెళ్లాలనుకుంటున్న భారత విద్యార్థులకు గుడ్ న్యూస్ భారత్ లోని బ్రిటన్ రాయబార కార్యాలయం భారత విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.త్వరలో ప్రయర్టీ, సూపర్ ప్రయార్టీ వీసాలు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. 3.గల్ఫ్ ప్రవాసులకు 5 వేల కోట్లు : బిఎస్పీ హామీ
తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి వస్తే గల్ఫ్ ప్రవాసులకు 5000 కోట్లు కేటాయిస్తామని తెలంగాణ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. 4.భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది.ఐక్యరాజ్యసమితి కి యూఎన్ఏ 11 వ యూత్ అబ్జర్వర్ గా భారత సంతతికి చెందిన హిమజా నాగిరెడ్డి ఎంపికయ్యారు. 5.భారత సంతతి వైద్యుడికి బ్రిటన్ లో అరుదైన గౌరవం
బ్రిటన్ లో భారత సంతతికి చెందిన ఓ వైద్యుడికి అరుదైన గౌరవం దక్కింది. డాక్టర్ శివ పటేల్ ను స్థానిక ప్రభుత్వం ” సిటిజన్ ఆఫ్ హానర్ ” అవార్డుతో సత్కరించింది. 6.భారత్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ శుభాకాంక్షలు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారత్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 7.ఉత్తర కొరియా అధ్యక్షుడికి రష్యా అధ్యక్షుడి లేఖ
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లేఖ రాశారు.ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను విస్తరిద్దాం అని లేఖలో పేర్కొన్నారు. 8.భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసించిన ఇమ్రాన్
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి ప్రశంసించారు.ఏ ఒత్తిడి కి లొంగకుండా భారత విదేశాంగ విధానం స్వతంత్రంగా ఉందని ప్రశంసించారు. 9.భారత్ కు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అమెరికా వ్యామోగామి హైదరాబాద్ మూలాలు ఉన్న అమెరికా వ్యామోగామి రాజాచారి భారత్ కు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 10.అంగాసాన్ సూకీ కి ఆరేళ్ల జైలు శిక్ష మయన్మార్ కీలక నేత, నోబెల్ బహుమతి విజేత అంగసాన్ సూకీ కి అవినీతి కేసులో అక్కడి కోర్టు 6 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
.