''లైగర్' ఫుల్లీ లోడెడ్ మసాలా మూవీ : వరంగల్ ఫ్యాన్‌ డమ్‌ టూర్ లో 'లైగర్‌’ చిత్ర యూనిట్

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) ఆగస్ట్ 25న విడుదలౌతుంది.ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు.

 Liger Fully Loaded Masala Movie, Liger Film Unit In Warangal Fandom Tour , Anan-TeluguStop.com

పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

ఇప్పటికే విడుదలైన లైగర్ ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలను పెంచాయి.తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఆగస్ట్ 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ‘లైగర్‌’ ఫ్యాన్‌డమ్‌ టూర్ ని వరంగల్-హన్మకొండ కాజీపేటలోని సత్యసాయి కన్వెన్షన్‌లో గ్రాండ్ గా నిర్వహించింది చిత్ర యూనిట్.

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ , వరంగల్ ఎంపీ పసుమూరి దయాకర్, డిప్యూటీ మేయర్ రిజ్వాన్ షమన్ ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన ఈ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

ఈ వేడుకలో కోకా పాటకి విజయ్ దేవరకొండ, అనన్య పాండే వేదికపై డ్యాన్స్ చేయడం ప్రేక్షకులుని ఆకట్టుకుంది.

ఈ వేడుకలో

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ

ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్షకులందరికీ నా ప్రేమ.ఇండియా అంతా తిరిగి ఇక్కడికి వచ్చాం.

కానీ ఎక్కడ తిరుగుతున్నా ఇక్కడి గురించే ఆలోచన.లైగర్ గురించి ఇక్కడ ఏమనుకుంటున్నారనే ఆలోచన.

వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో పెద్ద ఈవెంట్ చేయాలని అనుకున్నాం.వర్షం వలన కుదరలేదు.

కానీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారి ప్రోత్సాహం వలన ఈ ఈవెంట్ ఇక్కడ ఇంత గ్రాండ్ గా జరిగింది.నేను ఇండియాలో ఎక్కడి వెళ్ళిన జనాలు అమితమైన ప్రేమని పంచారు.

ఊహించని రీతిలో జనాలు వచ్చారు.అసలు ఇంత ప్రేమ ఎందుకు చుపిస్తున్నారో అర్దమయ్యేది కాదు.

అయితే ఏం జరుగుతున్నా అది ఇక్కడే మొదలైయింది.మన కాలేజ్ లో , మన థియేటర్ లో మన ఆంధ్ర తెలంగాణలో ఇది మొదలైయింది.

మీరు పంచిన ప్రేమని మర్చిపోలేను.ఆగస్ట్ 25న మీ ప్రేమని తిరిగివ్వాలి.

ఆగస్ట్ 25 ఆగ్ లాగా దేంగే అని వరంగల్ లోనే చెప్పాను.సినిమాపై ఎలాంటి డౌట్ లేదు.

సినిమా బ్లాక్ బస్టర్.తెలంగాణ , ఆంధ్ర షేక్ చేస్తే ఇండియా మొత్తం వినిపించాలి.

లైగర్ లో అమ్మా కొడుకు కరీంనగర్ నుండి బయలుదేరి కొడుకుని ఛాంపియన్ చేయాలని ముంబై వెళ్తారు.పూరి మా నాన్న, ఛార్మీ మా అమ్మలాగ ఇండియాని షేక్ చేద్దామని ముంబై వెళ్లాం.

ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొట్టాలనే బయలుదేరాం.పూరి గారు రాసిన డైలాగ్ చెప్పాలంటే అదృష్టం వుండాలి.

లైగర్ లో నాకు నచ్చిన డైలాగ్.వి ఆర్ ఇండియన్స్.

పోదాం, కొట్లాడదాం.ఆగ్ హే అందర్.

దునియా కో ఆగ్ లగా దేంగే.సబ్ కి వాట్ లాగా దేంగే.

ఆగస్ట్ 25న మనమందరం కలసి గట్టిగా కొట్టాలి.లైగర్ టీం అందరికీ థాంక్స్.

ప్రేక్షకులందరికీ థాంక్స్.ఐ లవ్ యూ” అన్నారు.

పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ

. హాయ్ వరంగల్.

, వర్షం పడుతున్నా తడిచిమరీ ఈ వేడుకకి విచ్చేసిన ప్రేక్షకులు, అభిమానులందరికీ లవ్ యూ.ఆగస్ట్ 25 విడుదలౌతుంది.కరణ్ జోహార్ గారికి స్పెషల్ థాంక్స్.ఆయన నుండి చాలా నేర్చుకున్నాను.అపూర్వ మెహతా మిగతా టీం అందరికీ థాంక్స్.మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారికి కృతజ్ఞతలు.

ఒక రోజు మా ఆవిడ తట్టింది.ఎందుకంటే.

కొత్త కొత్త దర్శకులు వస్తున్నారు మంచి మంచి సినిమాలు తీసుతున్నారు.నువ్వు వెనకపడిపోతున్నావ్.

సందీప్ రెడ్డి వంగా అనే డైరెక్టర్ వచ్చాడు.అర్జున్ రెడ్డి అనే సినిమా తీశాడు.

నేను నా కూతురు మూడు సార్లు చూశాం., నువ్వూ చూడు” అని చెప్పింది.

అర్జున్ రెడ్డి చూశా.డైరెక్షన్ బావుంది.

సినిమా కూడా బాగానే వెళ్తుంది.కానీ 45 నిమిషాలు సినిమా చూసి ఆపేశా.

కారణం.సినిమాలో కుర్రాడిపై నా ద్రుష్టి ఆగిపోయింది.

ఇంత నిజాయితీగా ఒక కుర్రాడు నటిస్తున్నాడని విజయ్ గురించే ఆలోచిస్తూ ఉండిపోయా.అప్పుడే విజయ్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నా.

విజయ్ లో నాకు నచ్చేది నిజాయితీ.లైగర్ లో ఎంత ఎలివేషన్ పెట్టినా కొంచెం పొగరు కూడా కనిపించదు.

చాలా నిజాయితీగా చేశాడు.ఒక నిర్మాతగా విజయ్ కి కోటి రూపాయిలు ఇస్తే వద్దు ముందు సినిమా కోసం ఖర్చుపెట్టండని అంటాడు.

తర్వాత రెండుకోట్లు పంపిస్తే.,,.మాకు అప్పులున్నాయని తెలిసి.ముందు అప్పులు తీర్చమని తిరిగిపంపించేస్తాడు.

ఈ రోజుల్లో ఇలా ఎవరంటారు ?! హ్యాట్సప్ టు విజయ్.విజయ్ నాన్నగారు మా అబ్బాయిని ఒక కొడుకులా చూసుకొని మంచి సినిమా తీయ్ అన్నారు.

కానీ విజయ్ నన్ను ఒక తండ్రిలా చూసుకొని నా కష్టాల్లో నాతో పాటు నిల్చున్నాడు.విజయ్ లాంటి హీరోని నేను చూడలేదు.

మైక్ టైసన్ ని పట్టుకోవడానికి ఏడాది పట్టింది.ఆయన్ని ఈ సినిమాలోకి తీసుకొచ్చిన క్రెడిట్ ఛార్మికి దక్కుతుంది.

మైక్ టైసన్ లాంటి లెజెండ్ తో కలసి పని చేసే అవకాశం రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం.ఆయనతో సినిమా చేస్తామంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు.

అనన్య ఫైర్ బ్రాండ్.అద్భుతంగా నటిస్తుంది.

రమ్యకృష్ణ గారు రెబల్ తల్లిగా కనిపిస్తారు.అమెది చాలా స్ఫూర్తిని ఇచ్చే పాత్ర.

ఛార్మీ సినిమా కోసం చాలా కష్టపడుతుంది.ఏ కష్టాన్ని నా వరకూ తీసుకురానివ్వదు.

సెట్ లో ఆమె ఏడ్చిన సందర్భాలు కూడా వున్నాయి.కానీ బయటికి చెప్పదు.

ఛార్మీకి బిగ్ థాంక్స్.అలీతో చేసిన సినిమాలన్నీ హిట్టే.

కష్టాల్లో సుఖాల్లో తోడుంటాడు.నాపై ప్రేమతో స్టేజ్ పై డ్యాన్స్ వేశాడు.

రోనిత్ రాయ్, మకరంద్ దేశ్ పాండే, చంకీ పాండే, గెటప్ శ్రీను, వంశీ అందరూ ప్రేమతో చేసిన సినిమా ఇది.అజీమ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు.భాస్కర భట్ల మంచి లిరిక్స్ రాశారు.సాగర్ సౌత్ మ్యూజిక్ చూసుకున్నారు.విష్ నటుడిగా తెలుసు.అతను రియల్ ఫైటర్.

ఈ సినిమాలో బ్యాడ్ గాయ్ రోల్ ప్లేయ్ చేశాడు.మా కంపనీ సీఈవో కూడా.

విష్ మా బలం.డివోపీ విష్ణు శర్మ, ఎడిటర్ జునైద్, ఆర్ట్ డైరెక్టర్ జానీ, అనిల్.మా పీఆర్వో వంశీ- శేఖర్, లీగర్, మార్కెటింగ్ టీమ్స్ ,శ్రేయాస్ మీడియా శ్రీనివాస్.అందరికీ కృతజ్ఞతలు.లైగర్ ఆగస్ట్ 25 న వస్తోంది.ఇది ఫుల్లీ లోడెడ్ మసాలా మూవీ.సినిమాని మీరంతా థియేటర్ లో చూడాలి’ అని కోరారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ

.వరంగల్ పై ప్రేమతో లైగర్ టీం ఇక్కడికి వచ్చింది.విజయ్ దేవరకొండ 25న దుమ్మురేపాలి.

పూరి జగన్నాధ్, ఛార్మీ ఇక్కడ స్టూడియో పెట్టాలని కోరుతున్నా.కేసీఆర్, కేటీఆర్ గారితో మాట్లాడి లాండ్ ఇప్పించే భాద్యత నాది.

విజయ్ దేవరకొండ నాకు బాగా దగ్గర బంధవు.నా పిలుపుతో ఇక్కడి వచ్చారు.వరంగల్ లో మొదలుపెట్టిన ఈ చిత్రం వందశాతం విజయం సాధిస్తుంది” అన్నారు.

అనన్య పాండే మాట్లాడుతూ

… నా పేరు అనన్య పాండే.తెలుగు ప్రేక్షకులకు నమస్కారం.తెలుగు ప్రేక్షకులంటే నాకు చాలా ఇష్టం.తెలుగు సినిమా కుటుంబం భాగం కావాలని కోరుకుంటున్నాను.ఆ అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను.

లైగర్ తో తెలుగులో ఎంట్రీ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా.విజయ్ దేవరకొండ, పూరి గారు, మైక్ టైసన్ గారితో పని చేయడం చాలా ఆనందంగా వుంది.

విజయ్ దేవరకొండ నా బుజ్జి కన్నా.ఆగస్ట్ 25న లైగర్ సినిమా థియేటర్ లో పగిలిపోద్ది.

లైగర్ ఫుల్ మాస్ కమర్షియల్ సినిమా.దింపుతున్నాం.మజా వస్తది” అన్నారు.

ఛార్మీ కౌర్ మాట్లాడుతూ

.ఐ లవ్ యూ వరంగల్.ఈవెంట్ చేయాలంటే నా ఫస్ట్ ఛాయిస్ వరంగల్.

ఇక్కడ ఈవెంట్ జరిగితే సినిమా సూపర్ హిట్.చివరి క్షణంలో వేదిక మారింది.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారు ఎంతో సహకారం అందించారు.లైగర్ గురించి చాలా మాట్లాడాలని వుంది.

కానీ లైగర్ సక్సెస్ కొట్టి బిగ్ బాక్సాఫీసు నంబర్స్ క్రియేటి చేసిన తర్వాత అప్పుడు సక్సెస్ మీట్ లో మాట్లాడతాను.ఆగస్ట్ 25 వాట్ లాగా దేంగే” అన్నారు

వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ

.‘లైగర్‌’ ఫ్యాన్‌డమ్‌ టూర్ కోసం వరంగల్ విచ్చేసిన చిత్ర యూనిట్, అతిధులకు, ప్రేక్షకులకు స్వతంత్ర భారత వజ్రోత్సవ శుభాకాంక్షలు.లైగర్ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు

ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ

విజయ్ దేవరకొండ చిత్రం లైగర్ దేశ, ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను.వర్ధన్న పేటలో ఈ టూర్ ని లాంచ్ చేయడం స్థానిక ఎమ్మెల్యేగా చాలా గర్వపడుతున్నా.

లైగర్ టీం అంతటికి బెస్ట్ విశేష్.తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు గొప్ప సహకారం అందిస్తుంది’ అన్నారు.

ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.

.‘లైగర్‌’ ఫ్యాన్‌డమ్‌ టూర్ కోసం వరంగర్ విచ్చేసిన చిత్ర బృందానికి, అతిధులకు, ప్రేక్షకులకు స్వతంత్ర భారత వజ్రోత్సవ శుభాకాంక్షలు.నాకు ఎప్పటి నుండో ఒక సందేహం వుంది.

విజయ్ కి ఆరేళ్ళ క్రితం పెళ్లి చూపులు జరుగాయి ? కానీ ఇప్పటికి ఎందుకు పెళ్లి కాలేదు ? (నవ్వుతూ ).విజయ్ ఈ సందేహాన్ని తీర్చాలి” అన్నారు.

వరంగల్ ఎంపీ పసుమూరి దయాకర్

: .‘లైగర్‌’ ఫ్యాన్‌డమ్‌ టూర్ కోసం వరంగర్ విచ్చేసిన చిత్ర బృందానికి శుభాకాంక్షలు.పూరి జగన్నాధ్ గారు ట్రెండ్ కి తగ్గట్టు అద్భుతమైన సినిమాలు చేస్తున్న దర్శకడు.ముఫ్ఫై ఏళ్ల పాటు తన సత్తాని నిలబెట్టుకుంటున్నారు.విజయ్ దేవరకొండ తన హార్డ్ వర్క్ తో దేశవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నారు.ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి” అని కోరారు.

డిప్యూటీ మేయర్ రిజ్వాన్ షమన్

: లైగర్ టీం అంతటికి ఆల్ ది బెస్ట్.ఈ సినిమా బిగ్ సక్సెస్ కావాలి” అని కోరారు.

విష్ మాట్లాడుతూ

దర్శకుడు, నిర్మాత, నటుడు, చిత్ర యూనిట్ అంతా కసితో చేసిన చిత్రం లైగర్.ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.

విజయ్ లాంటి గొప్ప నటుడితో కలసి పని చేయడం డబుల్ ఎనర్జీని ఇచ్చింది.అనన్య గ్రేట్ చార్మ్ వున్న నటి.ఛార్మీ గారు నా మార్గదర్శి.మదర్ అఫ్ డ్రాగన్స్.

పూరి గారు నా గాడ్ ఫాదర్.నా జీవితంలో కలసి క్యారెక్టర్ వున్న గొప్ప మనిషి పూరి గారు.

అలీ గారితో పాటు మిగతా నటీనటులు, టెక్నికల్ ఫైర్ తో ఈ సినిమా చేశాం.ఆగస్ట్ 25న ఆగ్ లాగా దేంగే” అన్నారు

అలీ మాట్లాడుతూ

తన సినిమాలలో డిఫరెంట్ పాత్రలు ఇచ్చిన నా మిత్రుడు పూరి జగన్నాధ్ కి కృతజ్ఞతలు.లైగర్.

విజయ్ అనన్యల జోడి వేడిపుట్టిస్తుంది.ఛార్మీ గారి కష్టం సినిమాలో కనిపిస్తుంది.

ఈ నలుగురికి ఆల్ ది బెస్ట్.లైగర్ ఎక్స్ టార్డీనరీ మూవీ.

విజయ్ ఈ సినిమా కోసం రెండేళ్ళు పాటు కష్టపడ్డారు.రెండేళ్ళు బాడీ మెంటైన్ చేయడం అంత ఈజీ కాదు.ఈ సినిమా కచ్చితంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది” అన్నారు.

రామ్ మిర్యాల మాట్లాడుతూ

.కోకా పాట ఒక మైకంలా కమ్ముకుంది.చాలా మంది పంజాబీ బీట్ కి తెలుగు లిరిక్స్ లా వుందని అన్నారు.కానీ ఏం చేస్తాం.లైగర్ .సాలా క్రాస్ బ్రీడ్ (నవ్వుతూ).ఈ అవకాశం ఇచ్చిన పూరి, విజయ్, ఛార్మి అందరికీ కృతజ్ఞతలు.ఆగస్ట్ 25 కోసం ఎదురుచూస్తున్నా” అన్నారు.

సునీల్ కశ్యప్ మాట్లాడుతూ

.లైగర్ కి నేపధ్య సంగీతం చేసే గొప్ప అవకాశాన్ని, ధైర్యాన్ని ఇచ్చిన పూరి గారికి కృతజ్ఞతలు.రౌడీకి మ్యూజిక్ చేయడం సులువు కాదు.

ఒక ఫైట్ చూపించి రీరికార్డింగ్ చేయమంటే చెమటలు పట్టాయి.మైక్ టైసన్ ని చూడగానే అసలు ఏం అర్ధం కాలేదు.

ఈ సినిమాకి వర్క్ చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది.ఈ సినిమా సమయంలో ఛార్మిగారితో పంచుకున్న విషయాలు మర్చిపోలేను.మీ అందరిలానే నేను ఈ సినిమాని చూడడానికి ఎదురుచూస్తున్నా.” అన్నారు

గెటప్ శ్రీను మాట్లాడుతూ

.పూరి గారు ఇందులో నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు.విజయ్ గారితో కలసి నటించడం ఆనందంగా వుంది.

ఈ సినిమా కోసం విజయ్ అన్న రాత్రిపగలు కష్టపడ్డారు.విజయ్ అన్న హార్డ్ వర్క్ కి హ్యాట్సప్.

ఆగస్ట్ 25 దేశం మొత్తం ఒక తుఫాన్ హెచ్చరిక.ఆ తుఫాన్ పేరు లైగర్.ఆగ్ లాగా దేంగే” అన్నారు.

వరంగల్ శ్రీను మాట్లాడుతూ

.లైగర్ ట్రైలర్ తో దేశం మొత్తం మెంటలెక్కిపోతుంది.పూరి గారు మైండ్ బ్లాంక్ అయిపోయేలా కొట్టారు.

విజయ్ దేవరకొండ ఇప్పుడు యువతకి స్ఫూర్తి.లైగర్ ఖచ్చితంగా గ్రేట్ సక్సెస్ కొడుతుంది” అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube