చికోటి ప్రవీణ్ క్యాసినో దందాపై ఈడీ అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు.కొందరు ముఖ్య నేతలకు ప్రవీణ్ బినామీ.?ఉన్నట్లు తెలుస్తోంది.హైదరాబాద్ ట్రూప్ బజార్‌లో చికోటి ప్రవీణ్ టైల్స్ వ్యాపారం చేశారని సమాచారం.
అనతి కాలంలోనే రూ.కోట్లు సంపాదన ఆయనకు ఉండేందని తెలుస్తుంది.చికోటి సంపాదనపై ఈడీ అధికారుల ఆరా తీస్తున్నారు.గోవా క్యాసినోలో ఏజెంట్‌గా గడించిన అనుభవం.పంటర్లను విదేశాలకు తరలించే స్థాయికి ప్రవీణ్ ఎదిగారని తెలస్తుంది.ఎమ్మెల్యేలు, మంత్రులు సహా.
ఐదు రాష్ట్రాల ప్రముఖులతో చికోటికి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది.క్యాసినోల నిర్వాహణతో కోట్ల రూపాయిలు చేతులు మారాయి.
రాజకీయ నేతల డబ్బును విదేశాలకు తరలించారు.చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఆర్థిక వ్యవరాలపైనా ఈడీ అధికారులు మరింత దృష్టి పెట్టారు.
ప్రముఖులతో లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. లావాదేవీల వివరాలు రాబట్టే పనిలో అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
చికోటి ప్రవీణ్, అతడి అనుచరులను ఈడీ అధికారులు విచారించనున్నారు.
అయితే చీకోటి ప్రవీణ్ తో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది.
ఏపీలో క్యాసినో ఏర్పాటుకు టీడీపీ నేతలు చికోటి ప్రవీణ్ తో సన్నహాలు చేశారు.అయితే ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందడంతో విజయవాడ, కంకిపాడు పరిసర ప్రాంతల్లో చర్చ మొదలవడంతో వెనక్కి తగ్గారని తెలుస్తుంది.
క్యాసినో వ్యవహారంలో లింకులు బయటపడుతున్నాయి.చికోటికి ఐదు రాష్ట్రాల ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం.
ప్రవీణ్, మాధవరెడ్డి, సంపత్, బబ్లూ లావాదేవీలపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు.చికోటి ఫైనాన్సిషల్ వివరాలపై ఈడీ అధికారుల ఆరా తీస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొందరు రాజకీయ నేతలు డబ్బును విదేశాలకు తరలించి ఉంటారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.ఆ విషయంపై ఈడీ అధికారులు నిమగ్నమయ్యారు.
విచారణ అనంతరం మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని ఈడీ అధికారులు చెబుతున్నారు.