యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన సినీనటి మంచు లక్ష్మీ.శ్రావణమాసంలో ఆలయంలో నిర్వహించే ‘కోటి కుంకుమార్చన’ టికెట్ కొనుగోలు చేసిన మంచులక్ష్మీ.
ఆలయానికి విచ్చేసిన సినీనటి మంచు లక్ష్మీకి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.
శ్రావణమాసంలో యాదాద్రి ఆలయంలో నిర్వహించబోయే శ్రావణ లక్ష్మీ కోటి కుంకుమార్చన పూజలలో పాల్గొనేందుకు పూజ రసీదులు కొనుగోలు చేశారు.
అదేవిధంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో శ్రావణ లక్ష్మీ కోటి కుంకుమార్చనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.