మా ఇంటి కోడలు పిల్ల అంటూ ఉపాసనకు చిరు బర్త్ డే విషెస్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా తనకంటూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు ఉపాసన.ఈమె అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా విధులను నిర్వర్తిస్తూ అలాగే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

 Megastar Wishes Happy Birthday To Upasana Details, Megastar Chiranjeevi, Upasana-TeluguStop.com

ఈ విధంగా ఎన్నో సమాజసేవ కార్యక్రమాలతో అందరి చేత ప్రశంసలు అందుకున్న ఉపాసనా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.ఇకపోతే ఉపాసన జూలై 20వ తేదీ తన 33వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

ఉపాసన జన్మదినం కావడంతో పెద్ద ఎత్తున మెగా అభిమానులు తనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక మెగా కుటుంబం సైతం తమ కోడలు పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఉపాసనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఉపాసన జన్మదిన వేడుకలలో భాగంగా చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు.

ఈ విధంగా చిరంజీవి ఈ ఫోటోని షేర్ చేస్తూ మా ఇంటి కోడలు పిల్ల ఉపాసనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తన కోడలికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్ ఉపాసన కలిసి దిగిన ఫోటోని చిరంజీవి షేర్ చేశారు.ఈ ఫోటోలో వీరందరూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించడంతో మెగా అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉపాసనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube