నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇప్పటికే ఈయన లవ్ స్టోరీ బంగార్రాజు వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.
ఇకపోతే విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా ఈనెల 22వ తేదీ విడుదల కానుంది.ఈ సినిమా విడుదలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
తాజాగా ఒక మీడియా సమావేశంలో భాగంగా నాగచైతన్య మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
![Telugu Dil Raju, Nagachaitanya, Naga Chaithanya, Nagachaithanya, Rashi Khanna, T Telugu Dil Raju, Nagachaitanya, Naga Chaithanya, Nagachaithanya, Rashi Khanna, T](https://telugustop.com/wp-content/uploads/2022/07/naga-chaithanya-intresting-comments.jpg)
ఈ సినిమాలో నాగచైతన్య సరసన రాశి ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్లగా నటించగా అవికాగోర్ కీలక పాత్రలో సందడి చేయనున్నారు.ఇక ఈ సినిమాని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ దిల్ రాజు గారి నిర్మాణంలో థాంక్యు వంటి అద్భుతమైన సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది.
సుమారు 12 సంవత్సరాల తర్వాత దిల్ రాజు నిర్మాణంలో మరోసారి ఈ సినిమా చేస్తున్నానని తెలిపారు.
![Telugu Dil Raju, Nagachaitanya, Naga Chaithanya, Nagachaithanya, Rashi Khanna, T Telugu Dil Raju, Nagachaitanya, Naga Chaithanya, Nagachaithanya, Rashi Khanna, T](https://telugustop.com/wp-content/uploads/2022/07/nagachaithanya-tollywood-thank-you-film.jpg)
ఇన్ని సంవత్సరాలు పాటు రాజు గారితో సినిమా చేయకుండా గ్యాప్ వచ్చిందనే విషయం గురించి తాను ఏ మాత్రం బాధపడటం లేదని ఇన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చిన థాంక్యూ వంటి ఒక అద్భుతమైన సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ నాగచైతన్య ఈ సందర్భంగా థాంక్యూ సినిమా గురించి తెలిపారు.ఈ క్రమంలోనే దిల్ రాజు గారి గురించి ఈయన మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ పోస్టర్స్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెంచాయి.
మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే కేవలం కొన్ని గంటలు వేచి ఉండాలి.