ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే కూరగాయల్లో టమాటో ముందు వరసలో ఉంటుంది.అందులో ఎటువంటి సందేహం లేదు.
ఎర్రగా నిగనిగలాడుతూ కనిపించే టమాటోల్లో పోషకాలు మెండుగా ఉంటాయి.అందుకే ఆరోగ్య పరంగా అవి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
చర్మ సౌందర్యానికి సైతం టమాటోను ఉపయోగిస్తారు.ముఖ్యంగా టమాటోతో ఇప్పుడు చెప్పబోయే విధంగా సింపుల్ రెమెడీని ట్రై చేస్తే మృదువైన మెరిసేటి చర్మాన్ని తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక టమాటోను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేయాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.అలాగే ఒక విటమిన్ సి టాబ్లెట్ ను తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల టమాటో పేస్ట్, విటమిన్ సి టాబ్లెట్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ కలబంద జెల్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సాయంతో ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని.ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.పూర్తిగా డ్రై అయిన అనంతరం వేళ్లతో మెల్ల మెల్లగా చర్మాన్ని రుద్దుకుంటూ వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఆ తర్వాత చర్మానికి ఏదైనా మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.తరచూ ఈ రెమెడీని ట్రై చేస్తుంటే ముఖం మృదువుగా, కాంతి వంతంగా మెరుస్తుంది.
మొటిమలు, వాటి తాలూకు మచ్చలు ఉంటే క్రమంగా తగ్గిపోతాయి.ఆయిలీ స్కిన్ సమస్య నుండి విముక్తి లభిస్తుంది.
మరియు డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి చర్మం నిగారింపుగానూ మారుతుంది.