పెండింగ్ హామీల అమ‌లుకు జ‌గ‌న్ ప్లాన్.. టార్గెట్ ఎన్నిక‌లేనా..?

ఏపీలో సాధార‌ణ ఎన్నిక‌ల‌కు రెండేళ్లు స‌మ‌యం ఉన్నా పొలిటిక‌ల్ హీట్ అప్పుడే మొద‌లైంది.ఇందులో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశమూ లేక‌పోలేద‌ని అన్ని పార్టీలు జోరు పెంచాయి.

 Jagan Plan For Implementation Of Pending Guarantees Is There No Target Election-TeluguStop.com

ఇక వైసీపీ కూడా ఆ దిశ‌గా అడుగులు వేస్తోంది.ఇప్ప‌టికే మూడేళ్లు గ‌డిచిపోగా మిగిలి ఉన్న హామీల అమ‌లుకు రంగం సిద్దం చేస్తోంది.

ప‌లు శాఖ‌ల‌పై కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్ ఫోక‌స్ పెంచారు.పెండింగ్ స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారింస్తోంది.

నిజానికి అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడు ఏం చేస్తే జ‌నం మెప్పుపొందుతారో బాగా తెలుసు.ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుంటే ఏం చేయాలి.

ఉద్యోగుల‌ను ఎలా గ్రిప్ లో పెట్టుకోవాలి అనే విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూడా ఆ దిశ‌గా ప్లాన్ రెడీ చేస్తోంది.

ఇక జ‌గ‌న్ మానసపుత్రిక అయిన సచివాలయం ఉద్యోగులకు గొప్ప వ‌రం ఇవ్వ‌బోతున్నారు.

వారిని అసలైన ప్రభుత్వ ఉద్యోగులను చేసే ప‌నిలో ప‌డ్డారు.ప్రోబేషన్ డిక్లరేషన్ మీద జగన్ సంతకం చేశారు.

దాంతో దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగులకు మేలు జ‌ర‌గ‌నుంది.అలాగే వారికి కొత్త పీఆర్సీ కూడా అమలు చేయ‌బోతున్నారు.

ప్ర‌భుత్వ ఖ‌జానాకు ఇది అతిపెద్ద భారం అయిన‌ప్ప‌టికీ వారి మెప్పుపొంద‌డానికే అంటున్నారు విశ్లేష‌కులు.అందుకే వారిని ఖుషీ చేసి దాదాపు ఐదు ల‌క్ష‌ల‌కు పైగా ఉన్న ఓట్ల‌ను రాబ‌ట్టాల‌ని చూస్తున్నార‌న్న‌ది చ‌ర్చ సాగుతోంది.

దీనికి ఎవ‌రూ అతీతులు క‌ద‌నే చెప్పాలి.సాధార‌ణంగా ఓట్లు రాబ‌ట్టుకోవ‌డానికి అన్ని ప్ర‌భుత్వాలు చేసేదే.

కాగా ఇటీవ‌ల శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనకు జగన్ వెళ్లినపుడు ప్రభుత్వ ఉద్యోగులకు గత పాలకులు ఏమీ చేయలేదని వారికి ఊహకు కూడా అందని మేలు తాము చేయబోతున్నామని అన్నారు.అంటే స‌చివాల‌య ఉద్యోగుల‌తోపాటే తొందరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్న‌ట్లేని అంటున్నారు.

సీపీఎస్ కోసం పోరాడుతున్న ఉద్యోగులకు జగన్ ప్ర‌భుత్వం ఊర‌ట క‌లిగించే వార్తా చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Telugu Ap Cm Jagan, Employees, Jagan-Political

అయితే అటు పాత పెన్షన్ విధానం కాకుండా ఇటు సీపీస్ కాకుండా జీపీఎస్ ని అమలు చేయడం ద్వారా ప్ర‌భుత్వ ఉద్యోగుల మన్ననలు పొందాలని జగన్ ప్ర‌యత్న‌మ‌ని స‌మాచారం.అందుకే పలు మార్లు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంద‌ని అంటున్నారు.ఈ చ‌ర్చ‌లు ఫ‌లిస్తే జీపీఎస్ ని ప్రకట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంటుందిని అంటున్నారు.

అలాగే ఉద్యోగులకు ఇచ్చిన మరికొన్ని హామీలను అమలు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

వీటితో పాటు మూడు రాజధానుల విషయంలో కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

పెండింగ్ హామీల‌ను ప‌రిష్క‌రించ‌డానికి ప్లాన్ చేస్తుండ‌టం.దీన్ని బ‌ట్టి చూస్తూ ముంద‌స్తు వ్య‌వ‌హారం ఏదైనా ఉందేమోన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.

ఇక ఏం జ‌ర‌గ‌నుందో వ‌చ్చే ఏడాది చూడాలి మ‌రి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube