పల్లీలు.వీటినే వేరుశనగలు అని పిలస్తుంటారు.
నిత్యం వంటల్లో వాడే ఆహార పదార్థాల్లో ఇవి ముందు వరసలో ఉంటాయి.తినేందుకు రుచిగా ఉండటమే కాదు.
కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, విటమిన్ బి, విటమిన్ ఇ, ప్రోటీన్, ఫైబర్‌తో పాటు బోలెడన్ని పోషక విలువలు పల్లీల్లో నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య పరంగా ఇవి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
అయితే హెల్త్‌కి ఎంత మేలు చేసినప్పటికీ.కొందరు మాత్రం పల్లీలకు దూరంగా ఉండాలి.
మరి ఆ కొందరు ఎవరెవరో లేట్ చేయకుండా తెలుసుకుందాం పదండీ.
కాలేయ వ్యాధులతో బాధపడే వారు పల్లీలను ఎవైడ్ చేయడమే మంచిది.ఒకవేళ తినాలనిపించినా.పరిమితంగా తీసుకోవాలని చెబుతున్నారు.
లేదంటే పల్లీల్లో ఉండే పలు కంటెంట్స్ కాలేయ వ్యాధులను మరింత తీవ్ర తరం చేస్తాయి.అలాగే కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్న వారికీ పల్లీలు ఏ మాత్రం మంచివి కావు.
పల్లీలు లెక్టిన్‌ను కలిగి ఉంటుంది.అందు వల్ల, వీటిని తీసుకుంటే కీళ్ల నొప్పులు అధికం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
పల్లీల్లో పొటాషియంతో పాటు సోడియం కూడా ఎక్కువగానే ఉంటుంది.కాబట్టి, ఎవరైతే హైబీపీ సమస్యతో సతమతం అవుతున్నారో.వారు వీలైనంత వరకు మితంగానే పల్లీలను తీసుకోవాలి.లేదంటే రక్త పోటు స్థాయిలు అదుపు తప్పడమే కాదు.గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది.కొందరికి పల్లీలు తింటే అలర్జీ వస్తుంటుంది.
అలాంటి వారు కూడా వేరెశనగలకు దూరంగా ఉండటమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అంతే కాదు, థైరాయిడ్ వ్యాధి ఉండి మందులు వాడుతున్న వారు, ఊబకాయంతో మదన పడుతున్న వారు సైతం పల్లీలను చాలా అంటే చాలా లిమిట్‌గా తీసుకోవాలి.
లేకుంటే ఆయా సమస్యలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.