ధియేటర్ నుండి నవ్వించి పంపించే బాధ్యత మాది --- కథ కంచికి మనం ఇంటికి నిర్మాతలు

అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ జంటగా యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మాతగా చాణిక్య చిన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కథ కంచికి మనం ఇంటికి.

 It Is Our Responsibility To Send Laughter From The Theater We Are The Producers-TeluguStop.com

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప‌బ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది.ఈ నేప‌థ్యంలో క‌థ కంచికి మ‌నం ఇంటికి చిత్రాన్ని ఏప్పిల్ 8న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో యూనిట్ సభ్య‌లు పాల్గొన్నారు.

నిర్మాత మోనిష్ ప‌త్తిపాటి మాట్లాడుతూ

క‌థ కంచికి మ‌నం ఇంటికి క‌థ డైరెక్ట‌ర్ చాణిక్య చిన్న నాకు నెరేట్ చేసిన‌ప్ప‌డు చాలా కొత్త‌గా అనిపించింది.

హార‌ర్ కామెడీ జాన‌ర్ లో ఇప్ప‌టికే చాలా సినిమాలు విడుద‌లైన‌ప్ప‌టికీ క‌థ కంచికి మ‌నం ఇంటికి సినిమా చాలా భిన్నంగా ఉంటూ ప్రేక్ష‌కుల్ని ఆద్యంతం అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కంతో మా చిత్ర బృందం భావిస్తున్నాము.ఈ సినిమాలో హీరో అదిత్ అరుణ్, పూజీత పొన్నాడ పేయిర్ ల‌వ్లీగా ఉండ‌నుంది.

అలానే ఆర్జే హేమంత్, గెటెప్ శ్రీను మ‌ధ్య న‌డిచే కామెడీ ట్రాక్ ఈ సినిమాకే మెయిన్ హైలెట్.ఏప్రిల్ భారీ రేంజ్ లో ఈ సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాము అని నిర్మాత మోనిష్ పత్తిపాటి తెలిపారు.

ద‌ర్శ‌కుడు చాణ‌క్య చిన్న మ‌ట్లాడుతూ

క‌థ కంచికి మ‌నం ఇంటికి స్టోరీ ఆద్యంతం వినోద‌భ‌రితంగా సాగుతుంది.అదిత్ అరుణ్, పూజిత మధ్య ప్రేమతో మొదలైన ఈ క‌థ‌ హార్రర్ జోనర్‌లోకి టర్న్ తీసుకుంటుంది.

సప్తగిరి కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది.మొత్తం సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు ద‌ర్శ‌కుడు చాణక్య‌.

ఈ క‌థ‌ను ఎక్కడా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మాత మోనిష్ ప‌త్తిపాటి, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ ద‌త్తి సురేశ్ బాబు నిర్మించారు.కోవిడ్ క‌ష్ట కాలంలో యూనిట్ లో ఎవ‌ర‌కి ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు.

భీమ్స్ సంగీతం, వైయ‌స్ కృష్ణ సినిమాటోగ్ర‌ఫి ఈ సినిమాను ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అవ్వ‌బోతున్నాయి.ఏప్రిల్ 8న ఈ సినిమా విడుద‌లై ప్రేక్ష‌కుల్ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని న‌మ్ముతున్నాను.

నటీనటులు: అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, వినోద్ కుమార్, శ్యామల, హేమంత్ , గెటప్ శ్రీను తదితరులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube