ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా గాని నిమిషాల్లో తెలిసిపోతుంది అంటే దానికి ముఖ్య కారణం.సోషల్ మీడియా అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.
సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి వింతలు, విశేషాలు జరిగినా ఇట్టే వైరల్ అయిపోతున్నాయి.సరిగ్గా ఇప్పుడు కూడా ఒక సంఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
నిజానికి చట్టం అనేది ఎవరికయినా ఒక్కటే.చట్టం దృష్టిలో అందరు సమానమే చట్టం ఎవరికీ చుట్టం కాదు అని చాలా సందర్భాల్లో మనం వినే ఉంటాము.
తప్పు చేసిన వారు ఎవరు అయినా సరే శిక్ష అనుభవించి తీరాలి.అలాగే చట్టాన్ని ప్రతి ఒక్కరు పాటించి తీరాలిసిందే.
కానీ ఒక వ్యక్తి మాత్రం చట్టంతో నాకు సంబంధం లేదు ఎందుకంటే నేను రాజకీయనాయకుడి మనవడిని అంటూ ఒక ఘనకార్యం చేసాడు.
వివరాల్లోకి వెళితే.
సాధారణంగా రోడ్డు మీద తిరిగే ప్రతి వాహనానికి నెంబర్ ప్లేట్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలిసిందే అనేది ఎప్పటినుంచో ఉన్న రూల్.కాని ఈ వ్యక్తి మాత్రం ఆ రూల్స్ నాకు పాటించవు అంటూ తన బైక్ కు గల నెంబర్ ప్లేట్ పై నంబర్స్ కు బదులుగా నేను ఎమ్మెల్యే మనవడిని అని రాసుకున్నాడు.
అతను ఎవరో కాదండి బిజెపి ఎమ్మెల్యే ఎంఆర్ గాంధీ మనవడు అయిన అమ్రిష్.నిజానికి ఇతను ఆయన సొంత మనవడు అయితే కాదు.
బిజెపి ఎమ్మెల్యే ఎంఆర్ గాంధి తమిళనాడులోని కన్యాకుమారిలోని నాగర్‌కోయిల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంగా వ్యవహరిస్తున్నారు.ఆయన ఎంతో నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతుంటారు.
ఇప్పటికి రాష్ట్ర అసెంబ్లీకి ధోతీని మాత్రమే ధరించి వస్తారు.ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నాడు.
అయితే ఎంఆర్ గాంధీ కారు డ్రైవర్ అయిన కన్నన్ ఎంతో కాలంగా గాంధీ వద్దనే డ్రైవర్ గా పనిచేస్తూ ఆయనతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవాడు.
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బైక్ మరెవరిదో కాదు గాంధీ కారు డ్రైవర్ అయిన కన్నన్ కొడుకుదే.కన్నన్ కొడుకు అయిన అమ్రిష్ తన బైక్‌పై ‘ఎమ్మెల్యే మనవడు’ అని రాసుకొని రోడ్ల మీద తిరుగడంతో అది చూసిన నెటిజన్లు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అవుతుంది.ఆ ఫోటోతో పాటు గ్రాండ్ సన్ ఆఫ్ నాగర్‌కోయిల్ ఎమ్మెల్యే.
ఇతనికి నెంబర్ ప్లేట్ అవసరం లేదు.అలాగే ట్రాఫిక్ రూల్స్ ను కూడా అతిక్రమించవచ్చు అంటూ ఈ ఫోటోను టాగ్ చేస్తూ పోస్ట్ చేయడం జరిగింది.
ఈ ఫోటో చూసిన కొందరు నెటిజన్లు ఇది చట్ట విరుద్ధమైన చర్య అంటూ కామెంట్స్ పెడుతున్నారు.