ప్రతి యొక్క భారతీయుడికి ఇప్పుడు ఆధార్ అనేది తప్పనిసరి అయిపోయింది.ఆధార్ కార్డులో వ్యక్తికి సంబందించిన అన్ని వివరాలు కూడా పొందుపరిచబడి ఉంటాయి.
అయితే ఇప్పుడు అదే ఆధార్ కార్డు ఒక తల్లి బిడ్డను కలిపింది.అదెలా అనుకుంటున్నారా.?! ఆరేళ్ల క్రితం కనిపించకుండా పోయిన మూగవాడు అయిన ఒక యువకుడిని ఆధార్ కార్డు అతని తల్లి చెంతకు చేర్చింది.వివరాల్లోకి వెళితే.
యెలహంక తాలుకా సింగనాయకనహళ్లికి చెందిన పార్వతమ్మ అనే మహిళా కూరగాయలు అమ్ముతూ జీవనాన్ని కొనసాగించేది.అయితే ఆరెళ్ల క్రితం అంటే 2016లో కొడుకు భరత్ ను వెంట తీసుకొని కూరగాయలు అమ్మేందుకు బయటకు వెళ్లింది.
అప్పుడు భరత్‌కు 13 ఏళ్లు ఉంటాయి.తినడానికి ఎమన్నా కొనుకుంటా అని తల్లి దగ్గరి నుంచి రూ.20 తీసుకొని వెళ్లిన భరత్ ఎంతసేపటికి తిరిగి రాలేదు.
కొడుకు కోసం పార్వతమ్మ అన్ని చోట్ల తిరిగింది.
ఎక్కడా కూడా కనిపించలేదు.కొడుకు కోసం ఏడ్చుకుంటూ యెలహంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
అలాగే ఆరేళ్లుగా తప్పిపోయిన కొడుకు కోసం ఎదురు చూస్తూనే ఉంది.అయితే స్నాక్స్ కోసం వెళ్లిన భరత మొదట యెలహంక రైల్వే స్టేషన్‌కు చేరుకొని అక్కడి నుంచి రైలులో మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు వెళ్లాడు.
అలా 10 నెలలు నాగ్‌పుర్ స్టేషన్లోనే గడిపాడు.అక్కడ అతడిని చూసిన రైల్వేస్టేషన్ అధికారులు అతన్ని పునరావాస కేంద్రానికి తరలించారు.
అయితే 2020లో అధికారులు భరత్ ను కొత్త ఆధార్ కార్డు నమోదు కోసం ఆధార్ సెంటర్ కి తీసుకుని వెళ్లగా భరత్ పేరిట అప్పటికే బెంగళూరు అడ్రెస్‌తో ఆధార్ కార్డు ఉందని తేలింది.
భరత్ తల్లి పార్వతమ్మ మొబైల్ నంబర్ కూడా అందులో దొరికింది.వెంటనే రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకు, పోలీసులకు సమాచారం ఇవ్వగా, యెలహంకలో మిస్సింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.యెలహంక పోలీసులు వెంటనే పార్వతమ్మను కలిసి విషయం చెప్పి వీడియో కాల్ ద్వారా భరత్‌తో మాట్లాడించారు.
ఆరేళ్ల తర్వాత కొడుకును చూసేసరికి పార్వతమ్మ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది.కొడుకు సైతం తన తల్లిని చూసి ఒక్కసారిగా ఏడ్చేసాడు.మార్చి 7న పార్వతమ్మ కుటుంబ సభ్యులతో కలిసి నాగ్‌పుర్‌కు వెళ్లి తన కొడుకును చూసి గుండెలకు హత్తుకుని బావోద్వేగానికి గురైయింది.