మన చిన్నప్పుడు చరిత్రలో ఖండాల గురించి చదివే ఉంటాము.ఇప్పటిదాకా మన భూగ్రహంపై ఉన్న ఖండాలు ఎన్ని అంటే టక్కున ఎవరయినా సరే 7 అని చెప్పేస్తారు.
ఈ ఖండాలు అనేవి మహా సముద్రాలచే వేరు చేయబడిన పెద్ద భూభాగాలు వాటినే మనం ఖండాలని పిలుస్తూ ఉంటాము.ఈ భూ ప్రపంచంపై మొత్తం ఏడు ఖండాలు ఉన్నాయని మనం ఇప్పటిదాకా అనుకుంటూ ఉన్నాము.
కానీ పరిశోధకులు మాత్రం ఖండాలు 7 కాదు మొత్తం 8 ఖండాలు ఉన్నాయని అంటున్నారు.నిజానికి 1642లోనే ఈ ఎనిమిదో ఖండాన్ని కనుగొన్నారు.
ఈ క్రమంలోనే 2017లో భూవిజ్ఞాన శాస్త్రవేత్తల బృందం అధికారికంగా ఈ ఖండం గురించి తెలుసుకుని దానికి ‘జీలాండియా’ అనే పేరు కూడా పెట్టారు.
మూడు శతాబ్దాల కిందటే డచ్ నావికుడు అబెల్ టాస్మాన్ 1642, ఆగస్ట్ 14న ఇండోనేషియాలోని జకార్తా నుంచి బయలుదేరి, ఆ ఖండాన్ని కనుగొనేందుకు ప్రయత్నించాడు.
చివరికి టాస్మాన్ న్యూజిలాండ్‌లోని దక్షిణ ద్వీపానికి వెళ్లారు.కానీ, ఆయన ప్రయాణం సజావుగా సాగలేదు.
అక్కడ నివసించే మావోరీ ప్రజలు టాస్మాన్‌కు సాయం కోసం ఏర్పాటు చేసిన పడవను నీటిలో ముంచగా నలుగురు ఆ ప్రమాదంలో చనిపోయారట.దీంతో టాస్మాన్ ఆ ప్రదేశాన్ని మూర్డెనర్స్ అంటే హంతుకులు నివసించే తీర ప్రాంతం అని పేరు పెట్టాడు.
ఆ ప్రాంతమే ఇప్పుడు మన పరిశోధకులు కనుగొన్న ‘జీలాండియా’ ఖండం అన్నమాట.కాగా 2017లో పరిశోధకులు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ ఖండం మడగాస్కర్ కంటే ఆరు రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉందట.
ఈ ‘జీలాండియా’ ప్రపంచంలోనే అతి చిన్న, పిన్న, సన్నని వయస్సు గల ఖండం అని చెప్పవచ్చు.అయితే, జీలాండియాలో 94% భూభాగం ఇంకా నీటి అడుగునే ఉన్నందున దీన్ని 8వ ఖండంగా ప్రకటించినా అంత ప్రాచుర్యంలోకి రాలేదు.ఈ ఖండం ఎంత మేరకు విస్తరించిందనేది పూర్తిగా తెలియరాలేదు.ఈ క్రమంలోనే హ్యూస్టన్ లోని రైస్ యూనివర్శిటీ ఎక్స్‌పెడిషన్ కో-చీఫ్ సైంటిస్ట్ గెరాల్డ్ డికెన్స్ ఈ విధముగా చెప్పుకొచ్చారు.
ఇప్పటివరకు 8,000 కంటే ఎక్కువ నమూనాలను అధ్యయనం చేయగా వందల శిలాజ జాతులను గుర్తించామన్నారు.అయితే, ఈ జీలాండియాలో ప్రజలు నివసించడం లేదు.ఈ ఖండం పసిఫిక్ మహా సముద్రంలో ఉంది.జీలాండియాలో 94% భూభాగం ఇంకా నీటి అడుగునే ఉంది.మిగిలిన 6% భూభాగంలో పక్షులు, జలచరాలు మినహా ఇతరత్ర జీవులేవీ భారీ సంఖ్యలో లేనట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.