యూఎస్: కాలిఫోర్నియా సర్జన్ జనరల్‌గా ఇండో అమెరికన్ వైద్యురాలు.. !!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు అక్కడి అన్ని రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.రాజకీయ నాయకులు, కార్పోరేట్ కంపెనీల సారథులు, డాక్టర్లు, శాస్త్రవేత్తలుగా రాణిస్తూ ఆశ్రయమిచ్చిన దేశంతో పాటు భారతదేశానికి కూడా గర్వకారణంగా నిలుస్తున్నారు.

 Indian Origin Devika Bhushan Is California’s Surgeon General , Devika Bhushan-TeluguStop.com

తాజాగా భారత సంతతికి చెందిన వైద్యురాలు దేవికా భూషణ్‌‌కు అమెరికాలో ఉన్నత పదవి దక్కింది.ఆమెను కాలిఫోర్నియా సర్జన్ జనరల్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ప్రస్తుత సర్జన్ జనరల్ నాడిన్ బుర్కే హారిస్ బుధవారం తన పదవికి రాజీనామా చేయడంతో దేవికాకు అవకాశం దక్కింది.ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జన్మించిన ఆమె. ఆయుష్మాన్ భారత్ సీఈవోగా వున్న ఇందూ భూషణ్ కుమార్తె.అంతేకాదు అమెరికాలో గన్ కల్చర్‌ను నిరోధించడం, ఫోస్టర్ కేర్ అమలుపై దేవిక పలు విశ్లేషణలు సైతం దేవికా రాశారు.

కొలంబియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీని, హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఎండీ , జాన్స్ హాప్‌కిన్స్ హాస్పిటల్ బ్లూమ్‌బెర్గ్ చిల్డ్రన్స్ సెంటర్‌లో జనరల్ పీడియాట్రిక్స్ రెసిడెన్సీని పూర్తి చేశారు దేవిక.

దేవికా భూషణ్.

గతంలో స్టాన్‌ఫోర్డ్ ఫ్యాకల్టీలో జనరల్ పీడియాట్రిక్స్ విభాగంలో క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేయడంతో పాటు.అక్కడి రెసిడెంట్స్‌కు పలు అంశాల్లో బోధనలు సైతం చేశారు.

ప్రస్తుతం ఆమె కాలిఫోర్నియా సర్జన్ జనరల్ కార్యాలయంలో చీఫ్ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.ఆఫీస్ ఆఫ్ కాలిఫోర్నియా సర్జన్ జనరల్‌ను 2019లో సృష్టించారు.

అప్పటి నుంచి వ్యవస్థాపక బృందం సభ్యురాలిగా వున్నారు దేవిక.అంతేకాదు కాలిఫోర్నియా సర్జన్ జనరల్ రిపోర్ట్‌కు ఎడిటర్ ఇన్ చీఫ్‌గా, రచయితగా కూడా దేవికా భూషణ్ వ్యవహరిస్తున్నారు.

అమెరికాలో రాష్ట్ర స్థాయిలో సర్జన్ జనరల్ పోస్ట్‌ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా పెన్సిల్వేనియా నిలిచింది.20 ఏళ్ల క్రితం 1996లో ఈ నియామకం జరిగింది.ఆ తర్వాత మిచిగాన్ (2003), ఆర్కాన్సాస్, ఫ్లోరిడా (2007), కాలిఫోర్నియా (2019)లు సైతం పెన్సిల్వేనియా బాటలో నడిచాయి.

Indian Origin Devika Bhushan Is California’s Surgeon General , Devika Bhushan, California, Surgeon General Nadine Burke Harris, General Pediatrics, Pennsylvania, Arkansas, Florida - Telugu Arkansas, Calinia, Devika Bhushan, Florida, Indianorigin, Pennsylvania, Surgeongeneral

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube