వైరల్ వీడియో: దేవుడా.. హాస్టల్ నుండి అమ్మాయిలని ఇలా కూడా తీసుకెళ్తరా..?

హాస్టల్ అంటే ఎన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు.లేడీస్ హాస్టల్ అయితే ఇంకా ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు.

 Student Taking Girl From The Hostel In Suitcase Details, Viral Latest, News Vira-TeluguStop.com

వార్డెన్ దగ్గర నుండి సెక్యూరిటీ గార్డ్ ల వరకు హాస్టల్లో ఉండే వాళ్ళ స్టూడెంట్స్ మీద ప్రత్యేక నిఘా పెట్టాలిసి ఉంటుంది.ఎవరైనా విద్యార్థులు కాలేజీ హాస్టల్ నుంచి బయటకు వెళ్లాలంటే తప్పకుండా సరైన రీజన్ ఉంటేనే బయటకు పర్మిషన్ ఇస్తారు.

ఒకవేళ సరైన కారణం లేకుండా బయటకు వెళ్లాలంటే అది చాలా కష్టం.పేరెంట్స్ ఫోన్ చేస్తేనే గాని వాళ్ళని ఔటింగ్ కి పంపరు.

అయితే కొంతమంది అతిమేధావులు మాత్రం ఏవో కారణాలు చెప్పి బయటకు వెళ్తారు.లేదంటే గోడ దూకడం లాంటివి చేస్తూ ఉంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే అమ్మాయి మాత్రం అలా ఏమి చేయలేదు కానీ మరొక కొత్త పద్దతిని ఆలోచించి దానిని అమలు చేసింది.తీరా బయటకు వీళ్ళే సమయంలో సెక్యూరిటీ గార్డ్స్ కి అడ్డంగా బుక్ అయిపోయింది.

ఇంతకీ ఆ అమ్మాయి ఎలాంటి ఆలోచన చేసిందో తెలిస్తే మీరు షాక్ అవ్వడం గ్యారంటీ.

సూట్‌కేసులో దాక్కుని బయటకు వెళదాం అని ప్లాన్ వేసింది.ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వీడియో ప్రకారం ఒక అబ్బాయి సూట్ కేసును హాస్టల్ బయటకు తీసుకు వెళుతూ ఉండగా వాళ్ళను సెక్యూరిటీ సిబ్బంది ఆపి ఆ సూట్ కేసును చెక్ చేశారు.

అయితే సూట్ కేసు ఓపెన్ చేయగానే అందులోంచి ఒక అమ్మాయి బయటకు రావడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు ఆశ్చర్యపోయారు.ఇలా కూడా హాస్టల్ నుంచి బయటకు వెళ్లొచ్చా అని వీడియో చూసిన నెటిజన్లు అందరు కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube