అవకాశాలు వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి.అస్సలు టైం వేస్టు చేసుకోవద్దు.
వీలున్నప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి.ఇదే సూత్రాన్ని అక్షరాలా పాటిస్తున్నారు సినీ దర్శకులు.
ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూనే.మరోవైపు వెబ్ సిరీస్ ల మీద ఫోకస్ పెడుతున్నారు.
కరోనా వరకు ఓటీటీలను పెద్దగా పట్టించుకోని సినిమా దర్శకులు.ప్రస్తుతం బాగా కాన్సంట్రేట్ చేస్తున్నారు.
పలువురు నిర్మాతలు సైతం వెబ్ సిరీస్పై ద్రుష్టి పెడుతున్నారు.తాజాగా హరీష్ శంకర్, దిల్ రాజు కలిసి ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా వీరిద్దరి కాంబోలో ఏటీఎమ్ అనే ఇంట్రస్టింగ్ వెబ్ సిరీస్ ప్రకటించారు.హరీష్ శంకర్ కథను దిల్ రాజు ఓ రేంజిలో ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే హరీష్ శంకర్ పవన్ కల్యాణ్ తో కలిసి భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేయనున్నాడు.దిల్ రాజు కూడా సౌత్ తో పాటు నార్త్ లోనూ పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా ఉన్నాడు.
అయినా సరే మెయిన్ స్ట్రీమ్ సినిమాలతో పాటు డిఫరెంట్ కంటెంట్ తో వెబ్ సిరీస్ లతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.
అటు తెలుగులో టాప్ దర్శకులు అయిన క్రిష్, నాగాశ్విన్ లాంటి డైరెక్టర్లుకూడా వెబ్ సిరీస్ లు చేశారు.జనాలను బాగా ఆకట్టుకున్నారు కూడా.సుకుమార్ కూడా పుష్ప మూవీ కంటెంట్ ని వెబ్ సిరీస్ లుగా చేద్దామనే ప్లాన్ లో ఉన్నట్లు చెప్పాడు.
వీళ్లతో పాటు తరుణ్ భాస్కర్, ప్రవీణ్ సత్తారు కూడా పిట్ట కథలు, లవెన్త్ అవర్ లాంటి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు తెరకెక్కించారు.మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
మొత్తంగా టాప్ మూవీ మేకర్స్ ప్రస్తుతం ఓటీటీలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రస్తుతం హరీష్ శంకర్, దిల్ రాజు ప్రాజెక్టు సక్సెస్ అయితే మరికొంత మంది టాప్ దర్శకులు కూడా ఇటు వైపు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.