టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆయన న్యూ ఇయర్ వేడుకలను జరుపు కోవడానికి వెకేషన్ కు వెళ్లిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా పవన్ వెకేషన్ నుండి హైదరాబాద్ తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది.ఆయన హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో వస్తున్నప్పుడు ఒక అభిమాని ఆయనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
ఆ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.అందులో పవన్ కళ్యాణ్ బ్లాక్ కలర్ టీ షర్ట్, జీన్స్ ధరించారు.
ఈ లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.పవన్ వెకేషన్ విషయానికి వస్తే ఆయన రష్యా కు విహార యాత్ర కోసం వెళ్లారు.
అక్కడ ఆయన భార్య అన్న లేజ్నోవా, పిల్లలతో కలిసి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను జరుపు కున్నారు.కరోనా కంటే ముందే పవన్ భార్య పిల్లలు రష్యా కు వెళ్లిపోయారు.
ఆ తర్వాత క్రిస్మస్ కంటే ముందు పవన్ కూడా రష్యా వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేసి తాజాగా హైదరాబాద్ తిరిగి వచ్చారు.ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే పవన్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా మేకర్స్ వాయిదా వేశారు.
సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా దగ్గుపాటి కూడా నటిస్తున్నాడు.
ఈ సినిమాతో పాటు పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా కూడా చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.త్వరలోనే మరొక షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు.
పవన్ వెకేషన్ అయిపోయిన తర్వాత ఈ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని ఇంతకు ముందు వార్తలు వచ్చాయి.మరి ఇప్పుడు పవన్ తన వెకేషన్ ఎంజాయ్ చేసి హైదరాబాద్ కూడా తిరిగి వచ్చేసారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది.